బిజినెస్

పుంజుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 22: దేశీయ మార్కెట్లు వరుసగా అయిదో రోజు బుధవారమూ పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్లలో వచ్చిన ర్యాలీకి తోడు అమెరికా మార్కెట్లు రికార్డు స్థాయిలో ముగియడంతో దేశీయ మార్కెట్లలో మదుపరులు బుధవారం ఉత్సాహంతో కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో కీలక సూచీలు పైకి ఎగబాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)లో మదుపరుల నుంచి వౌలిక సౌకర్యాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఆటో రంగ కంపెనీల షేర్లకు లభించిన ఆదరణతో సెనె్సక్స్ రెండు వారాల గరిష్ఠ స్థాయి అయిన 33,562 పాయింట్ల వద్ద ముగిసింది. టెలికం, లోహపు, ఆరోగ్య సంరక్షణ రంగాలకు చెందిన షేర్లలో మాత్రం కొనుగోళ్లు మందగించాయి. దేశీయ ఇనె్వస్టర్లు బుధవారం కొనుగోళ్లలో ముందు వరుసలో నిలిచారు. అయితే అమెరికా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడానికి ఇప్పటికీ మొగ్గు చూపుతోందని అమెరికా ఫెడరల్ చీఫ్ జానెట్ యెల్లెన్ చేసిన వ్యాఖ్యల తరువాత మాత్రం మదుపరులు ఆచితూచి అడుగులు వేశారు. పటిష్ఠమైన ప్రపంచ వృద్ధితో పాటు, కార్పొరేట్ కంపెనీల లాభాలు పెరగడం వల్ల వాల్ స్ట్రీట్ మరోసారి రికార్డు స్థాయిలో ముగిసింది. హాంకాంగ్ స్టాక్‌లు పదేళ్లలో తొలిసారి 30వేల మైలురాయిని అధిగమించాయి. బీఎస్‌ఈ సెనె్సక్స్ బుధవారం ఉదయం అధిక స్థాయిల వద్ద ప్రారంభమై, ఇంట్రా-డేలో 33,654.53 పాయింట్ల గరిష్ఠ స్థాయికి ఎగిసింది. ఆ తరువాత తగ్గి చివరకు 83.20 పాయింట్ల (0.25 శాతం) లాభంతో 33,561.55 పాయింట్ల వద్ద ముగిసింది. నవంబర్ 6 తరువాత సెనె్సక్స్ ఈ స్థాయిలో స్థిరపడటం ఇదే తొలిసారి. ఇంట్రా-డేలో సెనె్సక్స్ కొద్దిసేపు నష్టాల జోన్‌లోకి కూడా వెళ్లిపోయింది. గత వారం భారత సావరిన్ రేటును పెంచుతూ మూడీస్ ప్రకటన వెలువడిన తరువాత తిరిగి లాభాల బాట పట్టిన సెనె్సక్స్ క్రితం నాలుగు సెషన్లలో కలిసి 717.91 పాయింట్లు పుంజుకుంది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ బుధవారం ఇంట్రా-డేలో 10,368.70 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో కొంత పడిపోయింది. చివరకు 15.40 పాయింట్ల (0.15 శాతం) లాభంతో 10,342.30 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ ఇంట్రా-డేలో ఒక దశలో 10,309.55 పాయింట్ల కనిష్ట స్థాయికి కూడా పడిపోయింది. తరువాత కోలుకుంది. బుధవారం లావాదేవీల్లో అదానీ పోర్ట్స్ షేర్ ధర అధికంగా 3.27 శాతం పెరిగింది. లాభపడిన వాటిలో హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, ఎస్‌బీఐ, ఆసియన్ పెయింట్స్, మారుతి సుజుకి ఉన్నాయి. 2022 నాటికి పదివేల మెంబర్-ఓన్లీ స్టోర్‌లను ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నట్టు హోల్డింగ్ కంపెనీ ఫ్యూచర్ గ్రూపు మంగళవారం ప్రకటించడంతో ఫ్యూచర్ రిటెయిల్ షేర్ ధర బుధవారం 11.68 శాతం పెరిగింది.
స్వదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు (డీఐఐలు) తమ కొనుగోళ్లను కొనసాగించారు. మంగళవారం వీరు రూ. 825.50 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 727.01 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.