బిజినెస్

యువత తలచుకుంటే ఏదైనా సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్), డిసెంబర్ 2: ప్రోడక్ట్ మీది...మార్కెటింగ్ నాది..యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమే అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నగరంలోని ఏ కనె్వన్షన్‌లో వారంరోజులుగా జరుగుతున్న మెగా జాబ్ ఫెయిర్ వీక్ ముగింపు కార్యక్రమంలో శనివారం ముఖ్యఅతిధిగా పాల్గొన్న చంద్రబాబునాయుడు మాట్లాడుతూ విద్యార్థుల ఆలోచనలు ప్రపంచాన్ని మార్చే విధంగా ఉండాలన్నారు ఐటీ ద్వారా ఏదైనా సాధ్యమేనన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు మొత్తం ఐటీతో ముడిపడి ఉందన్నారు. శనివారం జరిగిన అసెంబ్లీ చివరిరోజు సమావేశంలో ఉద్యోగాలు ఇవ్వాలనే దానిపై ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. 20సంవత్సరాల ముందు ఐటీ ఎవరికీ తెలియదని, దూరదృష్టితో హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఏజెన్సీ ప్రాంతంలో గూగుల్ సంస్థ ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. మీ ఆలోచనలతో ముందుకు సాగాలని దానిని తాను మార్కెటింగ్ చేసి ఉద్యోగాలు కల్పిస్తామని విద్యార్థులకు సూచించారు. ప్రపంచం మొత్తం తెలుగువారు ఉండాలని, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఉన్నారన్నారు. 2019లోపు ఐటీలో లక్ష, ఎలక్ట్రానిక్స్‌లో రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేలా ఐటీ శాఖ కృషి చేయాలన్నారు.
విభజన సమయంలో బాధపడ్డాం: లోకేష్
ఐటీ శాఖ మంత్రి నారాలోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో చాలా బాధపడ్డామన్నారు. ఐటీ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోయిందని, అమరావతి, విశాఖపట్నంలో ఒక ఐటీ సంస్థ కూడా లేదని పేర్కొన్నారు. మూడు సంవత్సరాల కాలంలో 194 ఐటీ సంస్థలను రాష్ట్రంలో ప్రారంభించామన్నారు. టార్గెట్ అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే ఐటీ శాఖాధికారులకు టార్గెట్ పెట్టామన్నారు. మిగిలిన రాష్ట్రాలకు, దేశాలకు రోడ్లు, విమానాశ్రాయాలు, భవనాలు ఉండవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారన్నారు. ప్రపంచం మొత్తానికి ఈరోజు చంద్రబాబు బ్రాండ్‌గా మారిపోయారని, అందుకే ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. నెలకొసారి సదస్సులను విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని, తాను 2రోజుల్లో 22 కంపెనీల ప్రతినిధులను కలిశానన్నారు. చిత్తూరులోని శ్రీసిటీలో సుమారు 13వేల మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఐటీ కంపెనీలకు రెంటల్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. 2010లో గన్నవరంలోని మేధా టవర్స్‌లో రిబ్బన్ కట్ చేస్తే, సుమారు 7 సంవత్సరాలు ఖాళీగా ఉందని, నేడు కంపెనీలతో నిండిపోయిందన్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనా ధోరణులు వేరువేరుగా ఉన్నాయి. మెగా జాబ్ ఫెయిర్ వీక్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న తండ్రీ, తనయులు మాట్లాడుతూ ఒకరు ఉద్యోగాలు రాష్ట్రంలోనే చేయాలని విద్యార్థులకు సూచించగా మరోకరు ప్రపంచమంతా తెలుగువారు ఉండాలన్నారు. ముందుగా మాట్లాడిన లోకేష్ ఉద్యోగాలు రాష్ట్రంలో వస్తే ఎవరు చేయడానికి ఆసక్తి చూపడం లేదంటూ, పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్నాటక, తమిళనాడులో వస్తే వెళుతున్నారన్నారు. అలా కాకుండా అందరూ రాష్ట్రంలో ఉద్యోగాలు చేయడానికి ముందుకు రావాలని, మన రాష్ట్రాన్ని మనమే కట్టుకోవాలని సూచించారు. చంద్రబాబు మాట్లాడుతూ లోకేష్ వాదనను వ్యతిరేకిస్తున్నానని, తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండాలన్నారు. నేడు తెలుగు వారు ప్రపంచం అంతా ఉన్నారన్నారు. కొన్ని సంస్థల ప్రతినిధులతో సమావేశమైనప్ఫుడు తెలుగువారే ఉంటున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ అకాడమీ ఆధ్వర్యంలో నవంబర్ 25 నుండి డిసెంబర్ 1వతేదీ వరకు జరిగిన మెగా జాబ్ ఫెయిర్ వీక్‌లో 47 కంపెనీలు పాల్గొనగా 1032 మందికి ఉధ్యోగాలు లభించాయి. మొత్తం ఐదు ప్రాంతాల్లో జరిగిన ఇంటర్వూల్లో 7729 మంది విద్యార్థులు హజరుకాగా 10652 ఇంటర్వూలు నిర్వహించినట్టు ఎపిఐటీఎ సిఈఓ బి సుందర్ పేర్కొన్నారు.

చిత్రం..మెగా జాబ్ ఫెయిర్ వీక్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి