బిజినెస్

వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 3: రిజర్వ్ బ్యాంక్ (ఆరీబీఐ) ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. వరుసగా అయిదు త్రైమాసికాలు దిగజారిపోయిన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో తిరిగి పుంజుకోవడంతో ద్రవ్యోల్బణం నియంత్రణపైనే ఆర్‌బీఐ కేంద్రీకరిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. జీడీపీ పుంజుకోవడం వల్ల ఆర్‌బీఐపై వడ్డీ రేట్లను తగ్గించాలనే ఒత్తిడి తగ్గుతుందని వారు పేర్కొంటున్నారు. అయితే జీడీపీ తిరిగి పుంజుకోవడం, దేశ సావరిన్ రేటింగ్‌ను మూడీస్ పెంచడం వల్ల నెలకొన్న సానుకూల సెంటిమెంట్‌ను మరింత పెంచేందుకు వడ్డీ రేట్లను తగ్గించాలని దేశీయ కార్పొరేట్ సంస్థలు ఇప్పటికీ డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. 2017-18 సంవత్సరం అయిదో ద్వై-మాసిక ద్రవ్య విధాన ప్రకటనను చేయడానికి ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ నెల 5,6 తేదీలలో సమావేశం కానుంది. ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాలను 6వ తేదీ (బుధవారం) వెల్లడిస్తారు. అక్టోబర్‌లో జరిగిన సమీక్షా సమవేశంలో ఎంపీసీ బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. వడ్డీ రేట్లను తగ్గిస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుందేమోననే భయం తో వాటిని తగ్గించలేదు. ఈ ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 6.7 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఆర్‌బీఐ ఆగస్టులో బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించింది. దీంతో కీలక వడ్డీ రేట్లు ఆరు సంవత్సరాల కనిష్ట స్థాయి అయిన ఆరు శాతానికి తగ్గాయి. ఆర్‌బీఐ వరుసగా రెండోసారి రెపో రేట్ లేదా షార్ట్ టర్మ్ వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచుతుందని బ్యాంకుల నిర్వాహకులు, ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉన్నందున ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని వారు పేర్కొంటున్నారు. ‘ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య చలామణి చాలా తక్కువగా ఉంది. డిపాజిట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాందోళనలు నెలకొని ఉన్నాయి. అందువల్ల ఆర్‌బీఐ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశం ఉంది’ అని యూనియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) రాజ్‌కిరణ్ రాయ్ జి పేర్కొన్నారు. ఆర్‌బీఐ 2017-18 ఆర్థిక సంవత్సరం అంతా కూడా వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా కొనసాగిస్తుందని భావిస్తున్నట్టు గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మేజర్ నోమురా పేర్కొంది.