బిజినెస్

కనీస నీటిమట్టం దిగువకు ‘పులిచింతల’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 4: కృష్ణానదిలో ఈ ఏడాది సైతం సమృద్ధిగా వర్షాలు లేకపోవడంతో నాగార్జునసాగర్ గేట్లు దాటి కృష్ణమ్మ పులిచింతల ప్రాజెక్టు దరికి చేరకపోవడంతో ప్రాజెక్టులో నీటిమట్టం కనీస స్థాయికి దిగువకు పడిపోయిం ది. పూర్తి స్థాయి నీటి మట్టం 45,77 టీఎంసీలు కాగా కనీస నీటి మట్టం 4 టీఎంసీలు. ప్రస్తుతం జలాశయంలో 3.58 టీఎంసీల నీటి మట్టం మాత్రమే ఉంది. ఇన్‌ఫ్లో 1.859 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 3.821 క్యూసెక్కులు. పులిచింతల ప్రాజెక్టు కింద తెలంగాణ రాష్ట్రం పరిధిలో బ్యాక్ వాటర్ ఆధారంగా ఆరు ఎత్తిపోతల పథకాలు 6.9 టీఎంసీల నీటి ఆధారంగా నిర్మించగా దాదాపు 30 వేల ఎకరాల ఆయకట్టు కొనసాగుతోంది. వీటిలో వెల్లటూర్ శివగంగ ఎత్తిపోతల, దొండపాడు, నక్కగూడెం పరిధిలోనే ఇరవై వేల ఎకరాలకు పైగా రైతులు మిర్చి, పత్తి, వరి తదితర పంటలు వేశారు. ఈ ఎత్తిపోతల పథకాలు కనీసంగా 4 టీఎంసీల నీటి నిల్వ ఉంటేనే మోటార్లు సక్రమంగా నడిచే పరిస్థితి ఉంది. గత ఏడాది సైతం పులిచింతల రిజర్వాయర్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగువకు నీటి విడుదల చేసుకోవడంతో నీటి మట్టం 1.5 టీఎంసీలకు పడిపోయి దిగుబడి దశలో ఉన్న 20 వేల ఎకరాల మేర మిర్చి పంట దెబ్బతినడంపై రైతులు ఆందోళనకు దిగారు. మళ్లీ ఈ ఏడాది కూడా అదే పరిస్థితి పునరావృతమవుతోంది. ఏపీ నీటి విడుదల సాగిస్తుండడంతో రోజురోజుకూ పులిచింతల నీటిమట్టం అడుగంటిపోతుండగా తమ మోటార్లు నడిచేదెట్టా అంటూ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కృష్ణా బోర్డు సైతం తెలంగాణ ఎత్తిపోతల రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గతంలో కనీస నీటి మట్టం 4 టీఎంసీలు నిర్వహించాలని చెప్పినా మరోసారి దీనిపై ఏపీ శ్రద్ధ పెట్టకపోవడం ఎత్తిపోతల రైతులను కలవరపెడుతోంది. ఈ సమస్య యేటా పునరావృతమవుతున్న నేపథ్యంలో పులిచింతలను రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా పరిగణించాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బోర్డును కోరడం గమనార్హం. మరోవైపు వరుసగా రెండో ఏడాది కూడా పులిచింతల ప్రాజెక్టుకు కృష్ణమ్మ వరద కరుణ లేకపోవడంతో ఈ ఏడాది కూడా మూసీ నీరు, సమీప వాగులు, వంకల నుండి 13 టీఎంసీల మేరకు వరద నీరు ప్రాజెక్టులో చేరింది. గత ఏడాది 28 టీఎంసీల మేరకు మూసీ నీరు ప్రాజెక్టుకు చేరింది. ప్రాజెక్టు నుండి ఏపీ దిగువకు నీటి విడుదల సాగిస్తుండడంతో కనీస నీటిమట్టం కరువై పులిచింతల బ్యాక్ వాటర్ ఎత్తిపోతల రైతులకు సాగునీటి సమస్య ఎదురవుతోంది.
ఆగిన విద్యుత్ ఉత్పత్తి
పులిచింతల ప్రాజెక్టు నీటిమట్టం పడిపోవడంతో ఇరువైదు రోజుల క్రితమే పవర్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. ప్రాజెక్టులో 8 టీఎంసీల నీటిమట్టం ఉంటేనే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. పులిచింతల ప్రాజెక్టు నీటి ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం 120 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఒక్క యూని ట్ 30 మెగావాట్ల చొప్పున నాలుగు యూనిట్లతో 120 మెగావాట్ల ఉత్పత్తి చేయాల్సివుంది. సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ ప్రభుత్వం హయాంలో 2015లో మొదలయ్యాయి. ప్రస్తుతం మూడు యూనిట్ల పనులు పూర్తవ్వగా అక్టోబర్ నాటికి పూర్తికావాల్సిన నాలుగో యూనిట్ నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. గత ఏడాది నుండి రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి ఈ ఏడాది మూడో యూనిట్ ట్రయ ల్ రన్ పూర్తిచేసినా ప్రాజెక్టులో తగిన నీటిమట్టం లేక విద్యుత్ ఉత్పత్తి సాగడం లేదు.