బిజినెస్

భారీగా పుంజుకున్న బయోకాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: క్యాన్సర్ వ్యాధి చికిత్సలో భాగంగా వినియోగించే హెర్‌సెప్టిన్‌ను పోలిన ఔషధం ఓగివ్రిని అమెరికా మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు నియంత్రణ సంస్థ నుంచి తనకు అనుమతి లభించిందని ప్రకటించిన బయోకాన్ కంపెనీ షేర్లకు సోమవారం మార్కెట్‌లో మంచి ఆదరణ లభించింది. ఒక్క సెషన్‌లోనే ఈ కంపెనీ షేర్ల ధర 15 శాతం పెరిగింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,020 కోట్లు పెరిగింది. సోమవారం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ)లో జరిగిన లావాదేవీల్లో ఇంట్రా-డేలో ఈ కంపెనీ షేర్ల ధర 16.33 శాతం పెరుగుదలతో రూ. 519.50లకు చేరుకుంది. ఇది ఈ కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ స్థాయి. అయితే కొంతమంది మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో స్వల్పంగా పడిపోయి 15 శాతం లాభంతో రూ. 513.55ల వద్ద ముగిసింది. బయోకాన్ షేర్ల ధర ఒక్కసారిగా భారీగా పెరగడంతో ఆ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,020 కోట్ల పెరుగుదలతో రూ. 30,813.00 కోట్లకు చేరింది.
నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో బయోకాన్ షేర్ల క్రయ విక్రయాలు రూ. 491.95 ధర వద్ద ప్రారంభమయి, తరువాత 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 519.50కు చేరుకుంది. చివరకు స్వల్పంగా తగ్గి 15.60 శాతం లాభంతో రూ. 517 వద్ద ముగిసింది. బయోకాన్‌తో కలిసి మైలాన్ ఎన్‌వీ తయారు చేసిన హెర్‌సెప్టిన్‌ను పోలిన ఔషధం ఓగివ్రిని మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు అమెరికా ఆరోగ్య నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. బ్రెస్ట్, స్టమక్ క్యాన్సర్లను నయం చేయడానికి ఇచ్చే చికిత్సలో భాగంగా ఈ ఔషధాన్ని వాడతారు.