బిజినెస్

20 రోజుల్లో దిగొస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: మరో 15 నుంచి 20 రోజుల్లో కొత్త పంటలు మార్కెట్‌లోకి వస్తాయని, దాంతో రిటెయిల్ మార్కెట్‌లో ఉల్లి, టమాట ధరలు తగ్గుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎస్‌కే పట్నాయక్ తెలిపారు. ‘ఉల్లి, టమాట ధరల పెరుగుదల తాత్కాలిక సమస్య. పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది’ అని ఆయన ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ అన్నారు. వ్యాపార గణాంకాల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి, టమాట ధరలు కిలోకు రూ. 70 నుంచి 80 వరకు ఉన్నాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాలలోనూ ఇదే విధంగా వీటి ధరలు పెరిగాయి. ‘ఉల్లి, టమాటల ధరలు రానున్న కాలంతో తగ్గుతాయనే విశ్వాసం మాకు ఉంది. మహారాష్టల్రో ఎక్కువగా ఉల్లి పండిస్తారు. మహారాష్టల్రో ఈసారి ఉల్లి ఎక్కువగా వేశారు. పంట దిగుబడులు కూడా బాగుంటాయి. కొత్త పంటలు మార్కెట్‌లోకి రావడం ప్రారంభం అయితే, ధరలు తగ్గుతాయి. మరో 15-20 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుంది’ అని పట్నాయక్ పేర్కొన్నారు. రైతులు కొత్త టమాట పంట కూడా వేశారని, త్వరలోనే అది కూడా చేతికి వస్తుందని ఆయన అన్నారు. కొత్త పంటలు మార్కెట్‌లోకి రావడం ప్రారంభం అయితే, హోల్‌సేల్, రిటెయిల్ మార్కెట్లలో వాటి ధరలు తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో అకాల వర్షాలు, మరికొన్ని ప్రాంతాలలో వర్షాభావం వల్ల ఉల్లి, టమాట పంటల దిగుబడి తగ్గిపోయింది. దీంతో వాటి ధరలు ఆకాశాన్నంటాయి.