బిజినెస్

ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటుకు ఎన్‌ఎండీసీ చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: దేశంలో ఎన్‌ఎండీసీ నేతృత్వంలో ఉక్కు ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని ఈ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బైజేంద్రకుమార్ తెలిపారు. ఎన్‌ఎండిసి ఏర్పాటై అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 8 న ప్రత్యేకంగా వజ్రోత్సవం హైదరాబాద్ (శిల్పకళావేదిక) లో నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఏడాదిపొడవునా జరిపే ఉత్సవాలను ఉపరాష్టప్రతి ఎం. వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. వజ్రోత్సవాల లోగోను, స్టాంపును కూడా ఉపరాష్టప్రతి ఆవిష్కరిస్తారన్నారు. సంస్థ రూపొందించిన ప్రణాళికలను వివరిస్తూ, ఇనుప ఖనిజం (ఐరన్ ఓర్) తో పాటు బంగారు, వజ్రాల మైనింగ్‌లో భాగస్వామ్యం కావాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది 34 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని వెలికి తీశామన్నారు. దేశంలో అత్యధిక ఇనుప ఖనిజం ఉత్పత్తి సంస్థగా తమకు పేరుందని వివిరించారు. 2022 వరకు ఇనుప ఖనిజం ఉత్పత్తి సామర్థ్యాన్ని 67 మిలియన్ టన్నులకు పెంచాలని భావిస్తున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్‌ళోని పన్నా గనుల్లో భాగస్వామ్యం అవుతున్నామని, దేశంలోని ఇతర గనులను కూడా స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నామన్నారు. ఆస్ట్రేలియా, మోజాంబిక్, టాంజానియా తదితర దేశాల్లో కూడా గనుల తవ్వకంలో భాగస్వామ్యం అవుతున్నామన్నారు. గత ఏడాది 3196 కోట్ల పెట్టుబడులు పెట్టామని, ఈ ఏడాది 3500 కోట్ల పెట్టుబడులు పెడతామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తమ సంస్థ టర్నోవర్ 8829 కోట్లుగా ఉందని, ఆరువేల కోట్ల రిజర్వ్స్ ఉన్నాయని బైజేంద్రకుమార్ తెలిపారు. ఎన్‌ఎండిసి 1958 నవంబర్ 15 న ప్రారంభమైందని బైజేంద్రకుమార్ తెలిపారు. వజ్రోత్సవాల సందర్భంగా స్టీల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని, టాటా, జెఎస్‌డబ్ల్యు తదితర కంపెనీలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటాయన్నారు.