బిజినెస్

ఆర్‌బీఐ నిర్ణయంతో మార్కెట్లు కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 6: ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో రిజర్వ్ బ్యాంక్ (ఆరీబీఐ) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. కీలక వడ్డీ రేట్లు మారకపోవచ్చనే సంకేతాలు వెలువడంతో మంగళవారం పడిపోయిన మార్కెట్ ప్రధాన సూచీలు, బుధవారం ఆర్‌బీఐ నిర్ణయం వెలువడటంతో వరుసగా రెండో రోజూ పతనమయ్యాయి. కీలక వడ్డీ రేట్లలో కోత పడుతుందనే ఆశలు వమ్ము కావడంతో ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లలో విక్రయాలు భారీగా జరిగాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ బుధవారం 205 పాయింట్లు పడిపోయి, 32,597.18 పాయింట్ల వద్ద ముగిసింది. 50 షేర్లతో కూడిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 74.15 పాయింట్లు తగ్గి 10,044.10 వద్ద స్థిరపడింది. 30 షేర్లతో కూడిన సెనె్సక్స్ 205.26 పాయింట్లు (0.63 శాతం) తగ్గి, 32,597.18 వద్ద ముగిసింది. ఆర్‌బీఐ తన ద్రవ్య విధాన నిర్ణయాన్ని ప్రకటించిన కొద్ది సేపటికే ఈ సూచీ 32,565.16 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీ కూడా 10,033.35 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. అయితే ఈ రెండూ తరువాత కొంత పుంజుకున్నాయి. చివరకు నిఫ్టీ 74.15 పాయింట్లు (0.73 శాతం) తగ్గి 10,044.10 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ ఇంట్రా-డేలో 10,104.20 పాయింట్లను తాకింది.
పడిపోయిన బ్యాంకింగ్ షేర్లు
ఆర్‌బీఐ ద్రవ్య విధాన నిర్ణయంతో ప్రభావితమయ్యే బ్యాంకింగ్, రియాల్టీ, ఆటో రంగాల షేర్లు బుధవారం ఎక్కువగా పడిపోయాయి. కొటక్ మహీంద్ర బ్యాంక్, యెస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ల ధరలు పతనమయ్యాయి. బీఎస్‌ఈ బ్యాంక్ సూచీ 1.23 పాయింట్లు తగ్గి, 28,110.49 పాయింట్ల వద్ద ముగిసింది. రియాల్టీ రంగంలో గోద్రెజ్ ప్రాపర్టీస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఒబెరాయి రియాల్టీ కంపెనీల షేర్లు పడిపోయాయి. బీఎస్‌ఈ రియాల్టీ సూచీ 0.63 శాతం పడిపోయి, 32,597.18 పాయింట్ల వద్ద ముగిసింది.