బిజినెస్

అందరూ ఊహించినట్లే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 6: అందరూ అంచనా వేసినట్టుగానే జరిగింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. అయితే ఇంటి, వాహన రుణాలపై వడ్డీ రేట్లను కాస్త తగ్గించుకునేందుకు బ్యాంకులకు కొంచెం అవకాశం కల్పించింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో ద్రవ్యోల్బణం అంచనాను కూడా 4.3-4.7 శాతానికి పెంచింది. ఈ కాలంలో ద్రవ్యోల్బణం 4.2-4.6 మధ్య ఉంటుందని ఆర్‌బీఐ గతంలో అంచనా వేసిన విషయం విదితమే. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) 6.3 శాతానికి పెరిగినప్పటికి 2017-18 ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాను మాత్రం 6.7 శాతంగానే ఉంచింది. ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఈ ఆర్థిక సంవత్సర అయిదో ద్వై-మాసిక సమీక్షలో కీలక వడ్డీ రేట్లను ఏమాత్రం మార్చలేదు. రెపో రేటును ఆరు శాతంగా, రివర్స్ రెపో రేటును 5.75 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. వృద్ధికి ఊతమిస్తూనే, ప్రస్తుతం నాలుగు శాతంగా ఉన్న వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణాన్ని పాజిటివ్ రెండు నుంచి నెగెటివ్ రెండు శాతం మధ్యకు తగ్గించాలనే మధ్యకాలిక లక్ష్యాన్ని సాధించడానికి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో వేతన సంఘం సిఫార్సులను అమలు చేయడం వల్ల ఇంటి అద్దె అలవెన్సు (హెచ్‌ఆర్‌ఏ) ప్రభావం 35 శాతం వరకు ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. హెచ్‌ఆర్‌ఏ ప్రభావం డిసెంబర్ నెలలో ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ఉద్యోగులకు పెంచే వేతనాల వల్ల హెచ్‌ఆర్‌ఏ ప్రభావం మరింత పెరుగుతుందని, తద్వారా హౌసింగ్ ద్రవ్యోల్బణం 2018లో మరింత పెరుగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం మీద ఆహారం, ఇంధనం మినహా ద్రవ్యోల్బణం కాస్త పెరిగిందని, సమీప భవిష్యత్తులో ఈ పెరుగుదల కొనసాగే ప్రమాదం ఉందని ఆర్‌బీఐ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఇటీవలి కాలంలో పెరిగాయని, ఈ పెరుగుదల ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, ముఖ్యంగా వచ్చే సంవత్సరం అంతా ముడి చమురు ఉత్పత్తిలో కోతను కొనసాగించాలని పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్) నిర్ణయించడం వల్ల ముడి చమురు ధరల పెరుగుదల కొనసాగుతుందని తెలిపింది.
ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో రవీంద్ర హెచ్ ధోలకియా మాత్రం కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని వాదించారు. మిగతా సభ్యులంతా యథాతథంగా ఉంచాలని, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ఎంపీసీ తరువాత సమావేశం వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 6,7 తేదీలలో జరుగుతుంది.