బిజినెస్

జోనల్ శిక్షణ సంస్థ కృషి అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: రైల్వేలో భద్రత, డిజిటల్ మార్పులతో కూడిన శిక్షణ అందిస్తున్న రైల్వే జోనల్ శిక్షణ సంస్థ (జడ్‌ఆర్‌టిఐ) కృషి అభినందనీయమని దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ అన్నారు. ఎప్పటికప్పుడు తాజా సమాచార విప్లవ విశేషాలను ఉద్యోగులకు అందించే మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన జడ్‌ఆర్‌టిఐని అభినందించారు. జ్‌డ్‌ఆర్‌టిఐ 45వ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న జిఎం మాట్లాడుతూ, రైల్వేలోని మొత్తం కార్యాచరణ శక్తి సవాళ్లకు అనుగుణంగా మార్చుకుని విజయం వైపు పయనించాలని అన్నారు. రైల్వేలకు ప్రయాణీకుల భద్రత, సమయపాలన, చలనశీలత అనేవి నేటి కాలపు సవాళ్లని, వాటిని ధీటుగా అధిగమించేందుకు మనం కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జడ్‌ఆర్‌టిఐ ప్రిన్సిపాల్ ఎ.ఎల్.ఎన్.రెడ్డి తన వార్షిక నివేదికను సమర్పించారు. 2017-18 సంవత్సరంలో నవంబర్ వరకు ఈ సంస్థలో 133 కోర్సుల్లో 4307 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో 3257 లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్లలో 57 శాతం మందికి రిఫ్రెషర్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చినట్లు రెడ్డి వివరించారు.