బిజినెస్

వృద్ధి పథంలో ఆర్థిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, డిసెంబర్ 9: ఎన్‌డీయే ప్రభుత్వం చేపట్టిన వ్యవస్థీకృత సంస్కరణల దన్నుతో దేశ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి రేటు పథంలో దూసుకెళ్లడానికి రంగం సిద్ధమయిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రస్తుతం వౌలిక సౌకర్యాల రంగం, గ్రామీణ ప్రాంతాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంపై కేంద్రీకరించిందని ఆయన వెల్లడించారు. చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పశ్చిమ భారత ప్రాంతీయ శాఖ శుక్రవారం సాయంత్రం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జైట్లీ మాట్లాడుతూ తమ ప్రభుత్వం సరయిన సమయంలో వృవస్థీకృత సంస్కరణలు అమలు చేయడానికి పూనుకుందని, ఫలితంగా రానున్న రోజుల్లో అధిక వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తమ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాటు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను అమలు చేసిందని పేర్కొన్నారు.