బిజినెస్

14 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 9: నిరుటితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ నెలల మధ్య కాలంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నికరంగా 14.4 శాతం పెరిగాయి. ఈ కాలంలో ప్రత్యక్ష పన్నులు నికరంగా రూ. 4.8 లక్షల కోట్లు వసూలు అయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. 2017-18 బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల అంచనా రూ. 9.8 లక్షల కోట్లు కాగా, అందులో ఇప్పటి వరకు నికరంగా 49 శాతం వసూలు అయిందని ఆ ప్రకటన వెల్లడించింది. రిఫండ్‌లను సవరించడానికి ముందు అయిన మొత్తం ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 10.7 శాతం ఎక్కువతో రూ. 5.82 లక్షల కోట్లు ఉన్నాయని వివరించింది. ఈ మొత్తంలో రూ. 1.02 లక్షల కోట్లు ఈ సంవత్సరం ఏప్రిల్- నవంబర్ మధ్య కాలంలో రిఫండ్ చేసినట్లు పేర్కొంది.