బిజినెస్

డాలర్ల పంటకు ముప్పు... కావడంలేదు కనువిప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 10: డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సాగుకు రాష్ట్రంలో ముప్పు ఏర్పడుతోంది. సాగులో రైతులు నిషేధిత యాంటిబయోటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తుండటంతో ప్రధాన దిగుమతి దేశాలు తిప్పిపంపుతున్నా యి. దీనితో దేశీయంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రొయ్యల పరిశ్రమ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. రొయ్యల పెంపకంలో మోతాదుకు మించి మందులు వినియోగం, నిషేధిత యాంటిబయోటిక్స్ వినియోగంతో భవిష్యత్తులో పరిసరాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. రొయ్యల పెంపకానికి ఉపయోగించే నీటిలో నిషేధిత యాంటిబయోటిక్స్, మితిమీరిన మందులను కలుపుతున్నారు. రొయ్యల పెంపకం పూర్తయిన అనంతరం ఆ నీటిని సమీపంలోని
కాలువలు, డ్రెయిన్లు, సముద్రంలోకి వదిలేస్తున్నారు. దీంతో జీవరాశులు, చేపలు, పక్షులు, ప్రజలతో పాటు సముద్ర జీవరాశులపై కూడా తీవ్ర ప్రభా వం పడుతోందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తిరిగివచ్చేస్తున్న కంటైనర్లు
రొయ్యల్లో యాంటిబయోటిక్స్ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని ధ్రువీకరించుకున్న యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాలు దేశం నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ట్రేడర్స్ ఎగుమతి చేస్తున్న కంటైనర్లు వెనక్కి పంపించేస్తున్నారు. ఈ ఏడాది ఆక్వా రంగంలో ఉత్పత్తులు బాగున్నా.. వీటి ద్వారా జరిగే ఆర్థిక వృద్ధి క్షీణించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా ఉత్పత్తులు ఎగుమతులు చేసే వారికి కూడా కేరళ, ఒడిస్సా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ప్లాంట్లు ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి విదేశాలకు రొయ్యల ఎగుమతులు జరిపినా, అక్కడి పరీక్షల్లో విఫలమైన కంటైనర్లు కూడా వెనక్కి వస్తున్నట్టు సమాచారం. దీనిపైన ఎంపెడా మార్కెటింగ్ డైరెక్టర్ డోలా శంకర్ కూడా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఆయ నే కాకుండా యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాల నుంచి ఇటీవల భారత్‌కు వచ్చిన ఈ బృందాలు యాంటిబయోటిక్స్ రొయ్యలు లభించిన ప్రాంతాలను గుర్తించి కేరళ వంటి రాష్ట్రాల్లో పర్యటించారు. అయితే ఆ బృందం తనిఖీల్లో సంతృప్తి వ్యక్తంచేసిందని ఎంపెడా చెబుతోంది.
అంతంత మాత్రంగానే తనిఖీలు
రొయ్యల పెంపకంలో వినియోగించే డ్రగ్స్, యాంటిబయోటిక్స్‌పై పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. జిల్లా మత్స్యశాఖ ఏడీ, డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, రెవెన్యూ అధికారి, పోలీసు అధికారి, ఎంపీఈడీఏ, ఎన్‌ఎసీఎస్‌ఏ అధికారులు సభ్యులుగా రొయ్యల మేతలు, మందులను అమ్మే దుకాణాలను తనిఖీ చెయ్యా లి. అక్కడ నమూనాలను సేకరించి పరిశీలించాలి. నిషేధిత యాంటిబయోటిక్స్ దొరికితే మొదటిసారి రూ.25 వేలు జరిమానా విధించాలి. రెండోసారి పట్టుబడితే రూ.50 వేలు జరిమానాతోపాటు ట్రేడ్స్ లైసెన్సు రద్దుచెయ్యాలి. కానీ ప్రభుత్వ నిబంధనల మేరకు తనిఖీలు చేయడం లేదన్నది అందరికీ తెలిసిన రహస్యమే.

చిత్రం..వైరస్ సోకిన రొయ్యలు