బిజినెస్

కోటి రూపాయలకు ఊరినే అమ్మేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వేన్(జర్మనీ), డిసెంబర్ 11: డబ్బు కోసం ఇంటినో లేదా వస్తువునో విక్రయించిన సంగతే మనకు తెలుసు. అయితే ఒకప్పటి కమ్యూనిస్టు దేశమైన తూర్పు జర్మనీలో ఏకంగా ఊరునే అమ్మేశారు. 12 భవనాలు, షెడ్డు, గ్యారేజీలతోకలిపి మొత్తం 14,000 యూరోలు( రూ. 1.06 కోట్ల)కు గ్రామాన్ని అమ్మేశారు. ఉబేగువా- వారెన్‌బుర్కే అనే పట్టణాన్ని ఆనుకునే అల్వేన్ గ్రామం ఉంది. శనివారం నాడు జరిగిన ఓ వేలంలో అల్వేన్‌ను అమ్మేశారు. ఊర్లో జనాభా 20 మంది కాగా అందరూ పెద్ద వయస్కులే. బెర్లిన్‌కు దక్షిణగా 120 కిలోమీటర్ల దూరంలో అల్వేన్ గ్రామం ఉన్నట్టు ఎన్‌వై అనే వార్తా సంస్థ వెల్లడించింది. ఊరు మొత్తాన్ని అమ్మేసినట్టు ఉబేగువా మేయర్‌కూ తెలియదు. ఆయనకు కూడా మీడియాలో వార్త వచ్చాకే తెలిసింది. ఊరినంతటినీ ఒక్క బిడ్డరే దక్కించుకున్నట్టు మీడియా కథనం. అతడే ఎన్‌వై వార్త సంస్థ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ విషయం వెల్లడించారు.