బిజినెస్

మార్కెట్లకు కొనుగోళ్ల దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 11: ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల ధోరణితో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మదుపరులు కొనుగోళ్లకు పూనుకోవడం వల్ల మార్కెట్ల ప్రధాన సూచీలు రెండూ కూడా పైకి ఎగబాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 205 పాయింట్లు పుంజుకొని 33,456 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 10,300 స్థాయికి పైన స్థిరపడింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తాయన్న ఆశావాదంతో ఉన్న మదుపరులు సోమవారం కొనుగోళ్లకు పూనుకున్నారు. దీంతో వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పైకి ఎగబాకాయి. సెనె్సక్స్ సోమవారం 33,317.72 పాయింట్ల పటిష్ఠ స్థాయి వద్ద ప్రారంభమయి, ఇంట్రా-డేలో 33,535.97 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే అక్కడి నుంచి అది పైకి వెళ్లలేకపోయింది. చివరకు 205.49 పాయింట్ల (0.62 శాతం) లాభంతో 33,455.79 పాయింట్ల వద్ద ముగిసింది. నవంబర్ 29న 33,602.76 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్‌కు ఆ తరువాత సోమవారం ముగిసిన స్థాయియే గరిష్ఠం. ఈ సూచీ క్రితం రెండు సెషన్లలో కలిపి 653.12 పాయింట్లు పెరిగింది.
50 షేర్లతో కూడిన నిఫ్టీ కూడా సోమవారం 56.60 పాయింట్ల (0.55 శాతం) లాభంతో 10,322.25 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకు ముందు ఈ సూచీ 10,329.20- 10,282.05 పాయింట్ల మధ్య కదలాడింది.
రూపాయి బలపడటం కూడా సోమవారం స్టాక్ మార్కెట్‌లో సూచీలు పుంజుకోవడానికి దోహదపడింది. ఉద్యోగాలకు సంబంధించిన గణాంకాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చింది. ముఖ్యంగా ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) షేర్ల ధరలు పెరగడానికి దోహదపడిందని నిపుణులు పేర్కొన్నారు.
సోమవారం సెనె్సక్స్ ప్యాక్‌లోని కంపెనీలలో ఎంఅండ్‌ఎం కంపెనీ షేర్ ధర అత్యధికంగా 2.16 శాతం పెరిగింది. 2.15 శాతం పెరుగుదలతో లుపిన్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. మారుతి సుజుకి షేర్ ధర ఇంట్రా-డేలో జీవితకాల గరిష్ఠ స్థాయికి ఎగబాకినప్పటికీ, చివరకు 1.11 శాతం పెరుగుదలతో స్థిరపడింది. సోమవారం షేర్ల ధరలు పెరిగిన కంపెనీలలో హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, కోల్ ఇండియా, ఎస్‌బీఐ, ఐటీసీ, భారతి ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే, ఐటీ సూచీ ఒక శాతం పెరిగింది. టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, ఆటో రంగాల కంపెనీల షేర్లకు కూడా మదుపరుల నుంచి మంచి ఆదరణ లభించింది. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 0.36 శాతం వరకు పుంజుకున్నాయి. యునిటెక్ కంపెనీ బోర్డులో పది మందిని నామినేట్ చేసే అధికారాన్ని ఎన్‌సీఎల్‌టీ.. ప్రభుత్వానికి అప్పగించడంతో ఆ కంపెనీ షేర్ ధర 10.56 శాతం పెరిగింది.