బిజినెస్

వంద కోట్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆసియాన్ దేశాలతో సముద్ర, గగనతల, రోడ్డు మార్గాలలో అనుసంధానాన్ని పెంపొందించేందుకు భారత్ ఒక బిలియన్ డాలర్ల (రూ. వంద కోట్ల) రుణం ఇవ్వడానికి ప్రతిపాదించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఇక్కడ తెలిపారు. దీంతో పాటు కంబోడియా, లావోస్, మైన్మార్, వియత్నాంలలో మాన్యుఫాక్చరింగ్ హబ్‌లను అభివృద్ధి చేయడానికి భారత్ 77 మిలియన్ డాలర్లతో ప్రాజెక్టు అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. ‘ఆసియాన్ ఇండియా సముద్ర రవాణా సహకార ఒప్పందంపై చర్చించడం జరిగింది.. గగనతల అనుసంధానాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆసియాన్ ఇండియా పౌర విమానయాన టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది’ అని గడ్కరీ వివరించారు. ఆసియాన్ దేశాలతో భౌతిక, డిజిటల్ అనుసంధానాన్ని పెంపొందించేందుకు భారత్ ఒక బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ప్రతిపాదించిందని ఆయన పేర్కొన్నారు. సీఐఐ, ఆసియాన్ ఇండియా సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఆసియాన్-ఇండియా కనెక్టివిటి సమ్మిట్’లో మంత్రి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. షిప్పింగ్ నెట్‌వర్క్‌ల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు భారత్, మైన్మార్, థాయిలాండ్, కంబోడియా, వియత్నాంల మధ్య సముద్ర రవాణా వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేయడానికి ఆసియాన్, భారత్ అంగీకారానికి వచ్చాయని వెల్లడించారు. పరస్పరం సంపన్నం కావడానికి అనుసంధానత మార్గంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆసియాన్-్భరత్ సంబంధాలను బలోపేతం చేయడానికి ఉత్తమ అనుసంధానత ఎంతో ముఖ్యమని అన్నారు.