బిజినెస్

కాఫీకి గిట్టుబాటు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 12: గిరిజనులు పండించే కాఫీని మరింతగా ప్రోత్సహించి, దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి గిరిజన సహకార సంస్థ (జిసిసి) తీసుకున్న నిర్ణయంతో కాఫీ గింజలకు గిట్టుబాటు ధర లభించింది. గత రెండేళ్ళుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంతో గిరిజన రైతులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందగలుగుతున్నారు. జిసిసి ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం అపెక్స్ కమిటీని నియమించింది. దీంతో కాఫీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని అంశాలను నిశితంగా పరిశీలించడంతోపాటు దీనిపై అధ్యయనం చేసింది. దళారీ వ్యవస్థ ద్వారా తీవ్రంగా నష్టపోతుండటం, గిట్టుబాటు ధర లేని పరిస్థితులతో ప్రతి ఏడాది ఒక్కో ధరతో కాఫీ గింజలను విక్రయించాల్సి వస్తోందని గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తుండటాన్ని గుర్తించిన కమిటీ ఎట్టకేలకు గిట్టుబాటు ధరను నిర్ణయించింది. గత నెల 30న జరిగిన సమీక్షా సమావేశంలో అరేబికా పార్చిమెంటు కాఫీకి కిలో ఒక్కంటికీ రూ.85లు, అదే చెర్రీ కాఫీకి కిలోకి రూ.43లు, రోబస్తా చెర్రీకాఫీకి కిలోకి రూ.40ల వంతున గిరిజన రైతులకు చెల్లించేందుకు రాష్ట్ర స్థాయి అపెక్స్ కమిటీ నిర్ణయించింది. అలాగే ముడికాఫీని శుద్ధి చేసి, వచ్చిన గ్రేడు వారీ కాఫీని ఇ-వేలాల్లో అమ్మకాలు పూర్తిచేసిన తరువాత వచ్చే అమ్మకం సొమ్ములో మొదటి దశ చెల్లింపులు, ఇంతవరకు బట్వాడా చేసి ఉన్న కాఫీ రుణాలు పోనూ మిగిలిన మొత్తం రైతులకు అందజేస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఏవిఎస్ రవిప్రకాష్ ‘ఆంధ్రభూమి’కి మంగళవారం తెలిపారు. పూలింగ్ ఖర్చులు, కలాసీ చార్జీలు, రవాణా, వేలం ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పాడేరు ఏజెన్సీలో కాఫీ రైతులు అంతా జీసీసీ చేస్తున్న కాఫీ మార్కెటింగ్‌కు పూర్తి సహాయ,సహకారాలు అందివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఐటీడీఏ, జీసీసీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన కాఫీ ప్రాజెక్టు 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ప్రారంభమైందన్నారు. తొలి ఏడాదిలోనే 1500 మెట్రిక్ టన్నుల కాఫీ గింజల సేకరణను లక్ష్యంగా పెట్టుకోగా, 95శాతం మేర లక్ష్యాన్ని చేరుకోగలిగిందన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 338 మెట్రిక్ టన్నుల కాఫీ గింజల సేకరణతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పంట దిగుబడి పడిపోవడం, దళారీల జోక్యం వంటి కారణాలతో లక్ష్యాలను చేరుకోలేకపోగా, దీనిని ఈ ఏడాది భర్తీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇందులో భాగంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యాలను నిర్దేశించగా దీనిని చేరుకోవడం కోసం పంట అందుబాటులోకి వచ్చిన రోజు నుంచి సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా సాధిస్తున్న లక్ష్యాలతోపాటు గిరిజన రైతులకు ప్రతి ఏడాది సకాలంలో ధరలు చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. తొలి ఏడాదిలో రూ.11.5 కోట్లు, గత ఏడాది (2016-17) 338 మెట్రిక్ టన్నులకు రూ.3.5 కోట్లు మంజూరు చేశామన్నారు. గిరిజన రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరతోపాటు జీసీసీ ఎప్పటికపుడు ప్రోత్సహక పథకాలను అమలు చేస్తోందని, వీటిని సద్వినియోగపర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.