బిజినెస్

లాభాల స్వీకరణతో మార్కెట్ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 12: అంతర్జాతీయ సంకేతాలు, కొనుగోళ్ల మద్దతుతో తొలుత మూడు సెషన్లలో లాభాల జోరు కొనసాగించిన మార్కెట్ సూచీలు మంగళవారం నాడు దారుణంగా చతికిలపడ్డాయి. విశ్వవిపణిలో చమురు ధరలు పెరగడం కూడా మార్కెట్‌పై ప్రభావానికి కారణమైంది. ఫెడ్ సమావేశం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూడా మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రారంభం నుంచి మదుపర్లు లాభాల స్వీకరణ దిశగా మొగ్గు చూపడంతో తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో సూచీలు నష్టాలతో ముగిశాయి. మంగళవారం ఉదయం 67 పాయింట్లతో బలహీనంగా ప్రారంభమైన సెనె్సక్స్ ఆ తర్వాత ఏ విధంగానూ కోలుకోలేక పోయింది. ప్రఖ్యాత కంపెనీల షేర్లు కుదేలవడంతో ఒత్తిడికి గురైన సెనె్సక్స్ సూచీ 228 పాయింట్లను కోల్పోయి 33,228 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా 82 పాయింట్లు నష్టపోయి 10,240 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.43గా కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజిలో డాక్టర్ రెడ్డీస్, ఆదానీ పోర్టులు, ఓఎన్‌జీసీ, లుపిన్, ఇన్ఫోసిస్, ఎస్‌బిఐ, మారుతి సుజికీ షేర్లు లాభాల దిశగా కొనసాగాయి. హీరో మోటర్స్, టీసీఎస్, టాటా స్టీల్, ఐటీసీ, ఎల్ అండ్ టీ, హెచ్‌పీసిఎల్, బీపీసిఎల్, కోల్ ఇండియా, సిప్లా కంపెనీలు నష్టాలను చవిచూశాయి.