బిజినెస్

విస్తరణ పూర్తయ్యాకే అంతర్జాతీయ సర్వీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: గన్నవరం విమానాశ్రయ విస్తరణ పూర్తయ్యాక, అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వెల్లడించారు. విజయవాడలో ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ విస్తరణ వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 19 నుంచి గన్నవరం నుంచి ముంబయికి డైరెక్టు విమాన సర్వీసును ప్రారంభిస్తున్నామన్నారు. అమరావతిలో సీప్లేన్ ప్రదర్శన ఏర్పాటు చేయాలని స్పైస్ జెట్ సీఎండీని తాను కోరానని తెలిపారు. ఈ మేరకు విజయవాడలో ప్రదర్శన ఏర్పాటు చేశారన్నారు. ప్రపంచంలో ఏవియేషన్‌లో 14వ స్థానంలో ఉన్నామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందని, సీఎం సహా ఎంపీలంతా వెళ్లి కేంద్ర మంత్రిని కోరనున్నామని తెలిపారు.
19 నుంచి గన్నవరం-ముంబయ నూతన విమాన సర్వీసు
గన్నవరం, డిసెంబర్ 13: డిసెంబర్ 19 నుండి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్లు కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపారు. బుధవారం గన్నవరం ఎయిర్‌పోర్టులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఏవియేషన్ రంగంలో మనదేశం 14వ స్థానంలో ఉందన్నారు. నీటిలో, గాలిలో పయనించే సీప్లేన్ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. తన కోరిక మేరకు విజయవాడలో సీప్లేన్ ప్రదర్శన ఏర్పాటు చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందన్నారు. బుధవారం సీఎం చంద్రబాబునాయుడుతో సహా ఎంపీలందరూ ఢిల్లీలో కేంద్ర మంత్రిని నిధుల గురించి అడగనున్నట్లు చెప్పారు.