బిజినెస్

అనంతకు చేరుకున్న కియా కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, డిసెంబర్ 13: కొరియాకు చెందిన కియా కారు బుధవారం అనంతపురం జిల్లాకు చేరుకుంది. కొరియాలో తయారైన కియా కంపెనీ కారును అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీఏ కార్యాలయంలో బుధవారం రిజిస్ట్రేషన్ చేయించారు. కియా మోటార్స్ ఇండియా లిమిటెడ్ పేరిట సంస్థ ప్రతినిధి వినోద్‌కుమార్ కారును రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు. కియా కారుకు ఏపీ 02 బీపీ 2454 నెంబరు కేటాయించారు. వచ్చే ఏడాదిలో అమ్మవారిపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న కియా పరిశ్రమ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కంపెనీ యాజమాన్యం తరచూ ఇక్కడికి విచ్చేస్తుండటంతో వారి అవసరాల నిమిత్తం కారును రిజిస్ట్రేషన్ చేయించినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొరియాలో ఈ కారు తయారు కాగా 14 శాతం కస్టమ్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల కింద రూ. 4.83 లక్షలు ఆర్టీఏ కార్యాలయంలో చెల్లించారు. కియా సొరెంటో మోడల్ పేరుతో తయారైన కారును హిందూపురం ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. అమ్మవారిపల్లిలో ఏర్పాటు చేస్తున్న కియా కార్ల పరిశ్రమను జనవరి నెలలో సంబంధిత కంపెనీ ఛైర్మన్ సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఆ కారును రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. మొట్టమొదటిసారి అత్యంత విలువైన, ప్రతిష్టాత్మకమైన కియా కారు హిందూపురం ఆర్టీఏ కార్యాలయానికి రావడంతో చూసేందుకు జనం ఎగబడ్డారు.