బిజినెస్

భద్రాద్రి జిల్లాకు మణిహారంగా ఉక్కు పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటు చేయనున్న ఉక్కు పరిశ్రమతో జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనుంది. సుమారు రూ 5వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం కల్గిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పచ్చజెండా ఊపటంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండిసి) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఉక్కు పరిశ్రమకు అవసరమైన బొగ్గు, నీటి సౌకర్యంతోపాటు ముడి సరుకు అందుబాటులో ఉండటంతో పాల్వంచలోనే కర్మాగారం ఏర్పాటు చేయటానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం శాసన సభ్యులు జలగం వెంకటరావులు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్‌కు వినతిపత్రం అందజేసిన రెండు రోజుల వ్యవధిలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వలన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. బయ్యారం ప్రాంతం నుంచి ముడి ఖనిజాన్ని తరలించటం ద్వారా ఈ పరిశ్రమ మరింత అభివృద్ధి సాధించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ఎన్‌ఎండిసి నుంచి ఉత్పతె్తైన మెటీరియల్‌ను చెన్నై, చత్తీస్‌ఘడ్, పుదుచ్చేరి తదితర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. పాల్వంచలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయటం ద్వారా ఈ ప్రాంతం మరింత పారిశ్రామికంగా అభివృద్ది చెందే అవకాశాలున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.