బిజినెస్

ఏడు శాతానికి చేరుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: భారత ఆర్థిక వృద్ధి రేటు అట్టడుగు స్థాయికి చేరిందని, వచ్చే కొన్ని త్రైమాసికాలలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) తిరిగి ఏడు శాతానికి పుం జుకుంటుందని, అయితే ఇది 7.5 శాతానికి చేరడానికి మాత్రం కొన్ని సంవత్సరాలు పడుతుందని స్టాండర్డ్ చార్టర్డ్ తెలిపింది. భారత జీడీపీ హీనస్థితికి దిగజారడం ముగిసిపోయిందని 2018లో ఆర్థిక స్థితిగతులపై చేసిన ఒక అధ్యయనంలో తేల్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాను 6.5 శాతంగా, తరువాత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాను 7.2 శాతంగా తన అధ్యయన నివేదికలో వెల్లడించింది. విధాన నిర్ణయాల కారణంగా దెబ్బతిన్న వృద్ధి రేటు రానున్న నాలుగు నుంచి ఆరు త్రైమాసికాలలో తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని పేర్కొంది.