బిజినెస్

ద్రవ్యోల్బణానికి రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఉల్లిగడ్డల ధరలు విపరీతంగా పెరగడంతో పాటు సీజనల్ కూరగాయల ధరలు కూడా పెరగడం వల్ల నవంబర్ నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బ ణం 3.93 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభు త్వం గురువారం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఈ సంవత్సరం అక్టోబర్‌లో 3.59 శాతం, నిరుడు నవంబర్‌లో 1.82 శాతం ఉంది. వంటల్లో తప్పనిసరిగా ఉపయోగించే ఉల్లిగడ్డల ధరలు సంవత్సరం ప్రాతిపదికగా చూస్తే నవంబర్‌లో 178.19 శాతం పెరిగాయి. సీజనల్ కూరగాయల ధరలు కూడా బాగా పెరిగాయి. ఈ సంవత్సరం అక్టోబర్‌లో 36.61 శాతం ఉన్న వీటి ధర లు, నవంబర్‌లో 59.80 శాతానికి పెరిగా యి. అయితే మాంసకృత్తులు అధికంగా ఉండే కోడిగుడ్లు, మాంసం, చేపల ధరలు కలిపి చూసినప్పుడు వీటి ధరలు నవంబర్‌లో తక్కువగా 4.73 శాతం మాత్రమే పెరిగాయి. వీటి ధరలు అక్టోబర్‌లో 5.76 శాతం పెరిగాయి. కేంద్ర వాణి జ్య మంత్రి త్వ శాఖ ఆహార పదార్థాల డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం గత నెలలో 6.06 పెరిగింది. ఇది అక్టోబర్‌లో 4.30 శాతం పెరిగింది. యం త్రనిర్మిత వస్తువులకు సంబంధించిన ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 2.62 శాతం ఉండగా, నవంబర్‌లో 2.61 శాతం గా నమోదయింది. వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటెయిల్ ద్రవ్యోల్బణం గత నెలలో 15 నెలల గరిష్ఠ స్థాయి అయిన 4.88 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే.