బిజినెస్

ఏపీలో గూగుల్ ఎక్స్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 15: నవ్యాంధ్ర ఐటీ రంగంలో మరో ఘన విజయం. ఇప్పటివరకూ అమెరికాకు మాత్రమే పరిమితమైన దిగ్గజ ఐటీ కంపెనీ గూగుల్ ఎక్స్ త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టనుంది. ఆ మేరకు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో గూగుల్ ఎక్స్ కంపెనీతో ఒప్పందం కుదిరింది. దీంతో కొత్త రాష్ట్రంలో ఐటీని పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో యువ మంత్రి లోకేష్ చేస్తున్న విదేశీ పర్యటనలు ఫలించినట్టయింది. భారత్‌లో తొలిసారి అడుగుపెట్టనున్న గూగుల్ ఎక్స్ డెవలెప్‌మెంట్ సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటుకానుంది. గత నాలుగేళ్లలో రాష్ట్రం చేసుకున్న ఒప్పందాల్లో ఇదే అత్యంత కీలకమైనది. ఫైబర్‌గ్రిడ్‌తో ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్, ఎఫాక్స్ లింక్స్ గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేస్తుంది. దీంతో ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. ఫ్రీస్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్‌తో తక్కువ ధరకే గ్రామీణ ప్రాంతాలకు వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని గూగుల్ ఎక్స్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ మధ్య ఒప్పందం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఐటీశాఖ అధికారులు, గూగుల్ ఎక్స్ కంపెనీ సీఈఓ ఆస్ట్రో టెల్లర్ మధ్య ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్‌కు సంబంధించి ఒప్పందం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ ఎక్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించబోతున్నది. ఒప్పందంలో భాగంగా గూగుల్ ఎక్స్ మొదటిసారి ఇండియాలో అడుగు పెడుతుంది. త్వరలోనే విశాఖపట్నంలో గూగుల్ ఎక్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. అధునాతన టెక్నాలజీలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా గూగుల్ ఎక్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చెయ్యబోతుంది. ఇప్పటివరకూ వేమో (డ్రైవర్ లెస్ కార్), అధునాతన గూగుల్ గ్లాసెస్, ప్రొజెక్ట్ లూన్ (బెలూన్స్ ఎగరవేయడం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం) లాంటి టెక్నాలజీలను గూగుల్ ఎక్స్ అభివృద్ధి చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోయే సెంటర్‌లో అధునాతన టెక్నాలజీలపై పరిశోధన, అభివృద్ధి చేయనున్నారు. ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ ద్వారా అతి తక్కువ ధరకే ప్రజలకు బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది. ‘ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ ఎక్స్ రాకతో కమ్యూనికేషన్‌లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా 1.45 కోట్ల ఇళ్లు, 12918 పంచాయతీలు, 60వేలకు పైగా పాఠశాలలు, 10వేలకు పైగా ప్రభుత్వ కార్యాలయాలు, 670 మండల కార్యాలయాలు, 96 మున్సిపాలిటీలు, 14 కార్పోరేషన్లు, 6వేల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనుసంధానించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలిదశలో ఇప్పటికే ఏపీ ఫైబర్ ద్వారా 23వేల 800 కిలోమీటర్ల కేబుల్ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేశాం. రెండో దశలో 59వేల 563 కిలోమీటర్ల భూగర్భ కేబుల్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేయబోయే ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్‌ని వినియోగించబోతున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మరింత అధునాతన టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలకు ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటికే 1300 పాఠశాలలు, 15వందల ప్రభుత్వ కార్యాలయాలు, లక్షకు పైగా ఇళ్లు, 18వేల సీసీ కెమెరాలు ఇప్పటి ఏపీ ఫైబర్ అనుసంధానంలోకి వచ్చాయని, టెల్కో టవర్ల ద్వారా అన్ని ఆసుపత్రులు, సినిమా ధియేటర్లు, డేటా సెంటర్లు, బ్రాడ్‌కాస్ట్ కేంద్రాలను కూడా ఈ నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఐపీటీవీ, ప్రత్యేకమైన యాప్ ఏర్పాటు ద్వారా ఏపీ ఫైబర్ సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి రానున్నాయి. దీనికి గూగుల్ ఎక్స్‌తో ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రజలకు అనేక సేవలు అందించబోతున్నామని లోకేష్ వివరించారు. గూగుల్ ఎక్స్ సీఈవో ఆస్ట్రో టెల్లర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌తో ఒప్పందం చేసుకోవడం సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మా వంతు సహకారం ఇస్తాం. ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మారుమూల గ్రామాలను కూడా కనెక్ట్ చెయ్యబోతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా గూగుల్ ఎక్స్ తయారుచేసిన వేమో డ్రైవర్ లెస్ కార్‌లో మంత్రి లోకేష్ పర్యటించారు.