బిజినెస్

మన రొయ్యలు బంగారమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 2: విభజనానంతరం అభివృద్ధి పరుగులో ముందుండటానికి ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సాగును దినదినాభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఆ దిశగా అడుగులు కూడా వేగంగా ముందుకు వేస్తోంది. ప్రతీ నెల ఆక్వా రంగం పై సమీక్షలు చేస్తూ రొయ్య ఉత్పత్తి క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటుంది. రొయ్య రైతుకు ప్రభుత్వం భరోసా ఇస్తోంది. గతంలో కంటే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో 6.15లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న వనామీ రొయ్య ప్రభుత్వ అంచనాలకు తగినట్టుగా సిరులు కురిపించడంలో ముందుంటోంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రొయ్యల సాగు జరుగుతుంది. ప్రభుత్వం గత రెండేళ్లుగా రొయ్యల సాగు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించింది. సాగు విస్తీర్ణం పెంచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. భారతదేశం నుంచి విదేశాలకు ఎన్ని రకాల ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నా రొయ్యలది మాత్రం ఒక ప్రత్యేక స్థామని చెప్పవచ్చు. విదేశీ మార్కెట్‌లో మన రొయ్య ధర రోజురోజుకు పెరుగుతోంది. దీంతో రైతాంగమంతా కూడా రొయ్యల సాగు పైనే దృష్టికేంద్రీకరించింది. అందులో గోదావరి జిల్లాల రైతాంగం ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు.
వనామీ రాకతో
రైతులకు పెరిగిన ఆదాయం
గతంలో రొయ్యల సాగులో టైగర్ రొయ్యే కీలకపాత్ర పోషించేది. మార్కెట్‌లో ఆ రొయ్య టైగరే అనిపించుకుంది. 1990 వరకు ఇక్కడి రొయ్య విదేశీమార్కెట్‌కు అంతగా పరిచయం లేదు. 1990 తరువాత అమెరికా, చైనా, జపాన్, థాయ్‌లాండ్, వియాత్నం, తైవాన్, మలేషియా తదితర దేశాల్లో భారత్ రొయ్యకు డిమాండ్ పెరిగింది. దీంతో భారత్ రొయ్యకు ఎదురే లేకుండా పోయింది. ఆ తరువాత కాలంలో టైగర్ రొయ్యలకు వైరస్ సోకడంతో రైతులు కుదేలయ్యారు. 2008లో వనామీ రకం రొయ్యల రాకతో మళ్లీ రైతు పుంజుకున్నాడు. విదేశీమార్కెట్‌ను సైతం వనామీ రొయ్య శాసిస్తోంది. ప్రపంచంలోని మరే దేశంలో ఇంతటి నాణ్యమైన రొయ్య లభించకపోవడంతో ఒక ప్రత్యేక స్థానం లభించింది. దీంతో అప్పటి నుండి అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం తరహాలో వనామీ రొయ్య ధర ఇప్పటివరకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుత సీజన్‌లో 20 కౌంట్ వనామీ కిలో రూ.600 నుంచి రూ.800 వరకు కొనుగోలు చేస్తున్నారు. అలాగే 30 కౌంట్ రూ.400 నుంచి రూ.550 వరకు పలుకుతోంది.
6.15 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా..
ఈ ఏడాది 6.15 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యను ఉత్పత్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2015-16లో 4.9 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యను రైతులు ఉత్పత్తిచేశారు. అలాగే 2014-15లో 2.95 లక్షల మెట్రిక్ టన్నుల రొయ్యల ఉత్పత్తిజరిగింది. ఇదిలావుండగా విశాఖ రీజియన్ పరిధిలోని ప్రోసెసింగ్ ప్లాంట్లు రైతుల వద్ద రొయ్యలను కొనుగోలుచేసి వాటిని ప్రాసెస్‌చేసి, ఎంపెడా ఆధ్వర్యంలో పరీక్షలు చేయించి విదేశీ మార్కెట్‌కు ఎగుమతిచేస్తున్నాయి. రొయ్యలను ఉత్పత్తి చేయడంలో రైతు కీలకపాత్ర పోషిస్తే వాటిని నాణ్యమైన ఉత్పత్తిగా మలచి, విదేశాలకు ఎగుమతిచేయడంలో విశాఖ రీజియన్ పరిధిలో ఉన్న ప్రొసెసింగ్ ప్లాంట్లది ఒక ప్రత్యేక పాత్రగా చెప్పవచ్చు.

చిత్రం ఎగుమతికి సిద్ధమైన హెడ్‌లెస్ రొయ్యలు,
రొయ్యల గ్రేడింగ్