బిజినెస్

పన్ను ఎగవేతను నిరోధించేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పన్ను ఎగవేతలను నిరోధించే మార్గాలను అనే్వషించడంతో పాటు ఈ-వేబిల్‌ను త్వరగా అమలు చేసే అంశంపై చర్చించడానికి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి శనివారం సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతుందని, ఈ కొత్త వ్యవస్థలో ఉన్న లోపాలను పూడ్చడంపై, పన్ను ఎగవేతలను అణచివేయడంపై చర్చిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్ నెలలో జీఎస్‌టీ ద్వారా సంక్రమించే ఆదాయం రూ. 12వేల కోట్లు తగ్గిందని, ఇలా ఆదాయం తగ్గడానికి పన్ను ఎగవేత కూడా ఒక కారణమనే భావన నెలకొందని, ఈ నేపథ్యంలో శనివారం జరుగుతున్న జీఎస్‌టీ మండలి సమావేశం ప్రాధాన్యం సంతరించుకుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జీఎస్‌టీ మండలి సమావేశం కావడం ఇది 24వ సారి. గౌహతిలో నవంబర్‌లో జరిగిన గత సమావేశంలో 178 వస్తువులపై పన్ను రేట్లను తగ్గించారు. జీఎస్‌టీ నెట్‌వర్క్ పోర్టల్‌లో ఈ-వేబిల్ (ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్)ను సృష్టించే పద్ధతిని 2018 జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని అంతకు ముందు సమావేశంలో జీఎస్‌టీ మండలి నిర్ణయించింది. 2018 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. అక్టోబర్ నెలలో ప్రభుత్వానికి సమకూరిన జీఎస్‌టీ ఆదాయం రూ. 83,346 కోట్లు. జీఎస్‌టీ అమలు అయిన జూలై ఒకటో తేదీ నుంచి మొదటి మూడు నెలల్లో జీఎస్‌టీ ఆదాయం ఇంత తక్కువ ఎప్పుడూ రాలేదు. అంతకు ముందు నెలతో పోలిస్తే అక్టోబర్‌లో జీఎస్‌టీ ఆదాయం గణనీయంగా పడిపోయింది. సెప్టెంబర్‌లో సర్కారుకు సమకూరిన జీఎస్‌టీ ఆదాయం రూ. 95,131 కోట్లు. ఈ-వేబిల్‌ను ప్రవేశపెట్టే విషయమై జీఎస్‌టీ మండలి ఇదివరకే చర్చించిందని, పన్ను వసూళ్లు పెరగడానికి ఈ విధానం తోడ్పడుతుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం పేర్కొన్నారు. రూ. 50వేలకు పైగా విలువ గల సరుకుల రవాణాకు ఈ-వేబిల్ అవసరం ఉంటుంది. అయితే ఒక రాష్ట్రం పరిధిలో పది కిలో మీటర్ల దూరంలోపల సరుకులను తరలిస్తే సరఫరాదారు లేదా ట్రాన్స్‌పోర్టర్ వాటి వివరాలను పోర్టల్‌లో సమర్పించవలసిన అవసరం లేదు.

చిత్రం..కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో శుక్రవారం ఆయన కార్యాలయంలో సమావేశమైన కెనడా పెన్షన్ ప్లాన్ ఇనె్వస్ట్‌మెంట్ బోర్డు అధ్యక్షుడు, సీఈఓ మార్క్ గ మాచిన్