బిజినెస్

వ్యర్థాలు ఆర్థికోత్పత్తి పరిశ్రమగా మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: మహానగరంలో నిత్యం ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాలు ఆర్థికోత్పత్తి పరిశ్రమగా మారాలని అంతర్జాతీయ ఘన వ్యర్థాల సదస్సులో పాల్గొన్న పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు శుక్రవారం మొదలైంది. 30 దేశాలకు చెందిన 600 మంది ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న ఆధునికతకు సమానంగా మున్సిపల్ వ్యర్థాలు ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతోందని, ఈ రం గంలో సరైన శాస్ర్తియ పద్దతులు చేపట్టనందున ఘన వ్యర్థాలు జీవన విధానానికి విఘా తం కల్గిస్తున్నాయన్నారు. మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ అనేది హైదరాబాద్‌తో పాటు దేశంలోని అన్ని మున్సిపాల్టీలకు ఓ సవాలుగా మారిందన్నారను. నగరంలో తడి,పొడి చెత్తను వేరుగా సేకరించేందుకు 44 లక్షల డస్ట్‌బిన్లను పంపిణీ చేయటంతో పాటు త్వరితగతిన ట్రాన్స్‌ఫర్ స్టేషన్, డంపింగ్ యార్డుకు తరలించేందుకు 2వేల ఆటో టిప్పర్లను సమకూర్చినట్లు వివరించారు. అయినా ఆశించిన ఫలితాలు రావటం లేదని వాపోయా రు. ఈ విషయంలో నగరంలోని 22 లక్షల ఇళ్లకు నేరుగా వెళ్లి తడి,పొడి చెత్తను వేర్వేరు చేసే అంశంపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛదూత్ పేరిట కమ్యూనిటీ రిసోర్సు పర్సన్స్‌ను నియమించినట్లు తెలిపారు. ‘మనం మారుదాం..మన నగరాన్ని స్వచ్ఛందంగా మారుదాం’ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నామని వివరించారు. ఘన వ్యర్థాల రంగంలో గ్రేటర్ హైదరాబాద్ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు దేశంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదర్శంగా మారాయని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2018 లో హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సదస్సులో 250 మంది ఘన వ్యర్థాల నియంత్రణకు సంబంధించిన నిపుణులు తమ పత్రాలను సమర్పించనున్నట్లు సదస్సు నిర్వాహకులు వెల్లడించారు. వ్యర్థ పదార్థాల చట్టంలో ఉన్న ఘన వ్యర్థాలు, మున్సిపల్ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్, భవన నిర్మాణ వ్యర్థాలు, బయో, ప్రమాదకర వ్యర్థాల నిర్వహణపై మూడురోజుల పాటి సవివరంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఘన వ్యర్థాల నియంత్రణలో ఇప్పటికే ఆశించిన ఫలితాలను సాధించే విధానాలను అవలంభిస్తున్న జీహెచ్‌ఎంసీకి సదస్సు నిర్వాహకులు ప్రత్యేక పురస్కారాన్ని అందజేశారు.

చిత్రం..అంతర్జాతీయ ఘన వ్యర్థాల సదస్సులో మాట్లాడుతున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి