బిజినెస్

టెక్నాలజీ వినియోగంలో ఏపీ నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ), డిసెంబర్ 16: టెక్నాలజీ వినియోగంలో ఏపీ నెంబర్ వన్‌గా నిలుస్తోందని, ఉత్తమ పరిపాలన, మెరుగైన ప్రజా సేవలకు టెక్నాలజీ ఎంతో అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం విశాఖలో కరూర్ వైశ్యా బ్యాంక్ 101వ వ్యవస్థాపక దినోత్సవంలోముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా అమలయ్యే పౌర సేవలన్నింటినీ టెక్నాలజీతోనే అనుసంధానం చేస్తామన్నారు. రియల్‌టైమ్ మానిటరింగ్, ఆన్‌లైన్, ఆటోమేటెడ్ వ్యవస్థల్లో బ్యాంక్‌లు ముందుండాలన్నారు. ప్రపంచం మెత్తం సరళీకరణ, ప్రైవేటీకరణ దిశగా ముందుకు సాగుతోందని, దానికి అనుగుణంగా బ్యాంక్‌లు సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు. వందేళ్లుగా వ్యవసాయదారులకు, చిరు వ్యాపారులకు విశేష సేవలందించిన కరూర్ వైశ్యా బ్యాంక్ విశ్వసనీయతకు మారు పేరుగా నిలుస్తోందన్నారు. సమాజంలో ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా సంపాదించిన ధనంలో ఎంతో కొంత ఖర్చు పెట్టాలన్నారు. ఈ సందర్భంగా కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రతినిధులు మాట్లాడుతూ గుంటూరు జిల్లా బండారుపల్లి గ్రామాన్ని డిజిటల్ గ్రామంగా తీర్చిదిద్దడంతో ఆన్‌లైన్ సేవలు పొందగలుగుతున్నారన్నారు.
సామాజిక సేవ కింద కరూర్ వైశ్యా బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి రూపాయాలు కేటాయించిన పత్రాన్ని సీఎం చంద్రబాబుకు బ్యాంక్ చైర్మన్ స్వామినాథన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈవో పిఆర్ శేషాద్రి, మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు, విశాఖ ఎంపీ హరిబాబు తదితరలు పాల్గొన్నారు.

చిత్రం..విశాఖలో కరూర్ వైశ్యా బ్యాంక్ నిర్వహించిన వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు