బిజినెస్

రాష్ట్రానికి గ్లోబల్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 16: రాష్ట్రానికి గ్లోబల్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ రానుంది. యునెస్కో ఎంజీఐఈపీ, శాంసంగ్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖలో మూడు రోజుల పాటు జరిగే టెక్-2017లో భాగంగా శనివారం నాటి ప్రారంభ కార్యక్రమంలో శాంసంగ్ ప్రతినిధి దీపక్ భరద్వాజ్, రాష్ట్ర ప్రభుత్వం తరపున పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి బి ఉదయలక్ష్మి, ఆదిత్యనాథ్ దాస్, యునెస్కో ఎంజీఐఈపీ డైరెక్టర్ సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన గ్లోబల్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను రాష్ట్రంలో అమరావతి లేదా విశాఖలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
అలాగే గేమ్స్ ఫర్ లెర్నింగ్ ఔట్‌కం, యానిమేషన్ టెక్నాలజీ గేమింగ్ హబ్ ఏర్పాటుకు సంబంధించి యునెస్కో ఎంజీఐఈపీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్నాయి. విద్యకు సాంకేతిక విలువను జోడించి, మానవీయ విలువలు, సంబంధాలు, ప్రేమ, అనురాగం, మమత వంటి అంశాలను చిన్నప్పటి నుంచి విద్యార్థుల మనసుల్లో నాటుకునేలా విద్యా విధానంలో మార్పులు తీసుకురావడమే మూడు రోజుల పాటు జరిగే సదస్సు లక్ష్యం. గేమ్స్ ఫర్ లెర్నింగ్ ఔట్‌కం విధానంలో మేథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్ వంటి పాఠ్యాంశాలను సులభంగా అర్ధమయ్యే రీతిలో విద్యార్థులకు బోధిస్తారు. భవిష్యత్‌లో శాంతియుత సుస్థిర సమాజం నిర్మాణం కోసం యునెస్కో ఆధ్వర్యంలో జరుగుత్నున మేథోమథంలో భాగంగానే టెక్-2017 సదస్సులో కీలక నిర్ణయాలు ఉండనున్నాయి. సదస్సులో పలువురి నుంచి వచ్చిన సూచనలు, సలహాలు క్రోడీకరించి, వీటిని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలన్నదే లక్ష్యం. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల నుంచి దాదాపు 800 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. పలు అంశాలపై పూర్తి స్థాయిలో చర్చలు జరిగాయి.

చిత్రం.. గ్లోబల్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు సంబంధించి శాంసంగ్ సంస్థతో కుదుర్చుకున్న
అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న దృశ్యం