బిజినెస్

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 16: అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పవన్ హాన్స్ సంస్థ సహకారంతో ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ‘హెలీ టూరిజం’ను శనివారం విశాఖలో వుడాపార్కు వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విలేఖరులతో మాట్లాడుతూ ఇక్కడకు వచ్చే పర్యాటకులకు అన్ని అవకాశాలు, సదుపాయాలు కల్పించినపుడే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హోటళ్ళు, కనె్వక్షన్ సెంటర్, షాపింగ్‌మాల్స్ వంటివి అభివృద్ధి చెందాలన్నారు. అలాగే స్నేహపూర్వకంగా వ్యవహారిస్తూ సానుకూల వాతావరణం కల్పించడం ద్వారానే పర్యాటకులు పెరుగుతారన్నారు. దీనివల్ల ఉద్యోగాలు లభిస్తాయని, ఆదాయం వస్తుందన్నారు. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళిపోతున్నారని, పర్యాటకంగా అభివృద్ది చెందితే ఇక్కడే ఉద్యోగాలు వస్తాయన్నారు. గోవా కంటే కూడా విశాఖ సముద్రతీరం సుందరమైందన్నారు. దాని కంటే 40 రెట్లు విశాఖ బీచ్ బాగుంటుందన్నారు. ఎటు చూసినా పచ్చదనం, ఒకవైపు సముద్రం, మరోపక్క కొండలతో ఎంతో అందంగా కనిపిస్తుందన్నారు. అయితే ఇక్కడకు వచ్చే పర్యాటకుల కోసం వౌలిక వసతులు కల్పించాలన్నారు. టూరిజం పాలసీని తీసుకువస్తామన్నారు. వంద సీ ప్లేన్ల కోసం స్పైట్‌జెట్ సంస్థ ఆర్డర్ ఇచ్చిందన్నారు. దీనివల్ల విశాఖపట్నం నుంచి కనెక్టవిటీ ఉంటుందన్నారు. పర్యాటకులకు ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వగలిగితే అంత మేర అభివృద్ధి చెందుతుందన్నారు. నాలుగైదు రోజులపాటు ఇక్కడ గడిపేందుకు పర్యాటకులు ఇష్టపడాలని, అపుడే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దీనికనుగుణంగా వసతులు కల్పించాలన్నారు. ఈ సందర్భంగా హెలీ టూరిజం టికెట్లను నగరంలోని ఓ వైద్యుని కుటుంబానికి ముఖ్యమంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ, అనకాపల్లి ఎంపీలు డాక్టర్ కంభంపాటి హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పప్పల చలపతిరావు, గాదే శ్రీనివాసులనాయుడు, మంత్రులు గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

చిత్రం..విశాఖ వుడా పార్కులో హెలీ టూరిజం టికెట్లను అందజేస్తున్న ముఖ్యమంత్రి