బిజినెస్

అందుబాటులోకి ఈ-వేబిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: పన్ను వసూళ్లలో ఉన్న లోపాలను సరిదిద్ది, పన్ను ఎగవేతలను నిరోధించడానికి దేశవ్యాప్తంగా వచ్చే సంవత్సరం జూన్ ఒకటో తేదీ నాటికి ఈ-వేబిల్ విధానాన్ని అమలు చేయాలని వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన జీఎస్‌టీ మండలి తొలుత ఈ-వేబిల్ విధానాన్ని అమలు చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నెట్‌వర్క్ సన్నద్ధతను సమీక్షించింది. ఐటీ నెట్‌వర్క్ సన్నద్ధత పట్ల సంతృప్తి చెందిన జీఎస్‌టీ మండలి దేశవ్యాప్తంగా 2018 జూన్ ఒకటో తేదీ నాటికి ఈ-వేబిల్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిందని ఒక అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ-వేబిల్ విధానం ప్రకారం, రూ. 50వేలకు పైగా విలువ గల సరుకులను ఒక రాష్ట్రం నుంచి మరో చోటికి రవాణా చేయడానికి ముందు వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయవలసి ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా ఈ-వేబిల్ విధానాన్ని అమలు చేసేంత వరకు రాష్ట్రాలు వేటికవి వాటి పరిధిలో ఈ-వేబిల్ విధానాన్ని కొనసాగించడానికి జీఎస్‌టీ మండలి అధికారమిచ్చిందని ఆ ప్రకటన వివరించింది. అయితే, అంతర్‌రాష్ట్ర సరుకు రవాణాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వ్యాపార వర్గాలు ఇదివరకే ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఉన్నందువల్ల, వీలయినంత త్వరగా దేశవ్యాప్తంగా ఈ-వేబిల్ విధానాన్ని అమలు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. 2018 జూన్ ఒకటో తేదీ నాటికి దేశవ్యాప్తంగా ఈ-వేబిల్ విధానాన్ని అమలు చేసే చర్యలో భాగంగా 2018 జనవరి 16వ తేదీ నుంచి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. వ్యాపారులు, ట్రాన్స్‌పోర్టర్లు స్వచ్ఛందంగా జనవరి 16నుంచి ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొంది. అయితే రాష్ట్రాల మధ్య సరుకు రవాణాకు సంబంధించి జాతీయ స్థాయిలో నియమ నిబంధనలను 2018 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా తరువాత నోటిఫికేషన్ జారీ చేస్తారు.
పన్ను ఎగవేతకు ఆస్కారమిచ్చే లోపాలను పూడ్చడానికి జీఎస్‌టీలో భాగంగా ఈ-వేబిల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని జీఎస్‌టీ మండలి ఇదివరకే నిర్ణయించింది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్ నెలలో జీఎస్‌టీ ద్వారా సంక్రమించే ఆదాయం రూ. 12వేల కోట్లు తగ్గింది. ఇలా ఆదాయం తగ్గడానికి పన్ను ఎగవేత కూడా ఒక కారణమనే భావన నెలకొంది. అక్టోబర్ నెలలో ప్రభుత్వానికి సమకూరిన జీఎస్‌టీ ఆదాయం రూ. 83,346 కోట్లు. జీఎస్‌టీ అమలు అయిన జూలై ఒకటో తేదీ నుంచి మొదటి మూడు నెలల్లో జీఎస్‌టీ ఆదాయం ఇంత తక్కువ ఎప్పుడూ రాలేదు. అంతకు ముందు నెలతో పోలిస్తే అక్టోబర్‌లో జీఎస్‌టీ ఆదాయం గణనీయంగా పడిపోయింది. సెప్టెంబర్‌లో సర్కారుకు సమకూరిన జీఎస్‌టీ ఆదాయం రూ. 95,131 కోట్లు. అక్టోబర్‌లో జీఎస్‌టీ ఆదాయం గణనీయంగా పడిపోవడంతో ఈ-వేబిల్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి జీఎస్‌టీ మండలి త్వరపడుతోంది. అంతర్‌రాష్ట్ర, ఒకే రాష్ట్రంలోపల సరుకు రవాణాకు సంబంధించిన ఈ-వేబిల్ విధానం 2018 జనవరి 16నాటికి సిద్ధంగా ఉంటుందని, అయితే ఈ విధానాన్ని అమలు చేయడానికి 2018 జూన్ ఒకటో తేదీలోపు ఏ తేదీనయినా రాష్ట్రాలు ఎంచుకోవచ్చునని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వివరించింది.

చిత్రం..శనివారం ఢిల్లీలో నాబార్ డ నిర్వహించిన కార్యక్రమంలో అరుణ్ జైట్లీ