బిజినెస్

హ్యాకింగ్‌కు గురైన జుకర్‌బర్గ్ ట్విట్టర్ ఖాతా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 6: ఫేస్‌బుక్ సిఇఒ, వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్.. ట్విట్టర్, పింటెరెస్ట్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయి. జుకర్‌బర్గ్ 2012 లింకెడిన్ ఖాతా నుంచి పాస్‌వర్డ్‌లను పొందినట్లు హ్యాకర్ గ్రూప్ ప్రకటించిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ‘అవర్‌మైన్ టీమ్’ అనే హ్యాకర్ గ్రూప్ ఈ చర్యకు పాల్పడగా, జుకర్‌బర్గ్ ట్విట్టర్ పేజ్ నుంచి 40,000 మందికిపైగా ట్విట్టర్ ఫాలోయర్స్‌కు సందేశాన్ని కూడా పంపిందీ గ్రూప్. ఇక జుకర్‌బర్గ్ పింటెరెస్ట్‌పై ‘అవర్‌మైన్ టీమ్ ద్వారా హ్యాకైంది’ అని ఓ కొత్త శీర్షికను పెట్టిందీ గ్రూప్.
కాగా, 2012లో 164 మిలియన్లకుపైగా లింకెడిన్ యూజర్ల డేటా చౌర్యానికి గురైంది. జుకర్‌బర్గ్ డేటా కూడా దొంగిలించబడగా, దీని ద్వారానే ఆయన ట్విట్టర్, పింటెరెస్ట్ ఖాతాలను హ్యాకింగ్ చేసినట్లు అవర్‌మైన్ టీమ్ చెప్పిందని ది న్యూయార్క్ డైలీ న్యూస్ తెలిపింది. ఈ క్రమంలోనే జుకర్‌బర్గ్ రహస్య పాస్‌వర్డ్ ‘జ్ఘూజ్ఘూజ్ఘూ’ను పొందినట్లు హ్యాకర్ గ్రూప్ పేర్కొందని వివరించింది. అయితే 2012 నుంచే జుకర్‌బర్గ్ ట్వీట్ చేయడం మానేశారని కూడా తెలిపింది. ఇదిలావుంటే జుకర్‌బర్గ్ ఇన్‌స్ట్రాగ్రామ్ ఖాతాను కూడా హ్యాకింగ్ చేశామని హ్యాకర్ గ్రూప్ చెబుతున్నప్పటికీ, అందుకు తగిన ఆధారాలేమీ కనిపించడం లేదని ది న్యూయార్క్ డైలీ న్యూస్ స్పష్టం చేసింది. ఫేస్‌బుక్‌కు చెందినదే ఈ ఇన్‌స్టాగ్రామ్ అన్నది తెలిసిందే. మరోవైపు మరికొందరు ప్రముఖుల ఖాతాలనూ హ్యాకింగ్ చేసినట్లు అవర్‌మైన్ టీమ్ చెబుతోంది. ఇందులో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, సాఫ్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్ ట్విట్టర్ ఖాతా కూడా ఉండటం గమనార్హం. దీంతో ఇప్పుడిది వినియోగంలో లేదు. గత వారం ప్రముఖ అమెరికన్ గాయని కటీ పెర్రీ ట్విట్టర్ ఖాతా కూడా హ్యాకింగ్‌కు గురవగా, తాజాగా ఆ జాబితాలో జుకర్‌బర్గ్ కూడా చేరిపోయారు. మొత్తానికి హ్యాకింగ్ మహమ్మరి సాఫ్ట్‌వేర్ దిగ్గజాలనూ వదలడం లేదు.