బిజినెస్

విశాఖ ఉక్కులో 10 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని అనుసరించి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ (విశాఖ ఉక్కు కర్మాగారం)లో ప్రభుత్వానికి ఉన్న 100 శాతం వాటాలో 10 శాతాన్ని పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ) ద్వారా విక్రయిచడం జరుగుతుందని ఉక్కు శాఖ సహాయ మంత్రి విష్టు దేవసాయి పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడులను ఉపసంహరించుకోవాడానికి కారణాలేమిటి అని ఎంపీ విజయ సాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనకు 2012లోనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని వెల్లడించారు.