బిజినెస్

లాభదాయకం లేని బ్యారన్లను తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: ఏపీలో లాభాలలో లేని పొగాకు బ్యారన్లను తీసివేయడానికి అనుమతి ఇవ్వాలని గోదావరి జిల్లా రైతులు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభుకి విజ్ఞప్తి చేశారు. ఎంపీలు తోట నరసింహం, మురశీమోహన్, మాగంటి బాబు, గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, కంభంపాటి హరిబాబు, కొత్తపల్లి గీత గురువారం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. లాభదాయకంగా లేని బ్యారన్లను తొలిగించడానికి అనుమతి ఇవ్వడంతోపాటు రూ.10 లక్షలు పరిహారం కల్పించాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. అలాగే నకిలీ సిగరెట్లకు అడ్డుకట్ట వేస్తే, రైతులకు మంచి ధర వస్తుందని వివరించారు. బ్యారన్లను తొలిగించాలనుకుంటున్న రైతులను ఏ విధంగా అదుకోవాలన్న దానిపై పది రోజుల్లో నిర్ణయిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు రైతులు తెలిపారు.