బిజినెస్

రూ. 500 ఇస్తే ఆధార్ వివరాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: ఐదొందల రూపాయలు చెల్లిస్తే పేటియంలో వ్యక్తుల ఆధార్ వివరాలు పొందవచ్చన్న మీడియా కథనాలను విశిష్ట గుర్తింపుప్రాథికారిత సంస్థ (యూఐడీఏఐ) కొట్టిపారేసింది. 500 రూపాలతో లక్ష మంది వ్యక్తుల ఆధార్ వివరాలు క్షణాల్లో లభిస్తాయని ఓ ఆంగ్ల పత్రికలో కథనాలు వెలువడ్డాయి. దీనిపై యూనిక్‌ఐడీ తీవ్రంగానే స్పందించింది. ‘ఆధార్ వివరాలకు పూర్తి భద్రత ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు వచ్చే అవకాశం లేదు. 12 అంకెల యూనిక్‌ఐడీ సురక్షితం’అంటూ సంస్థ ప్రకటించింది. ఆధార్ గోప్యతకు సంబంధించి ఎలాంటి అనుమానాలూ వద్దని ఇలాంటి వదంతులను నమ్మోద్దనని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పేటియం ఏజెంట్‌కు 500 రూపాయల చెల్లించి వేరే వ్యక్తుల ఆధార్ వివరాలు సంపాదించాడని పత్రిక పేర్కొంది. లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో 10 నిముషాల్లో ఆధార్ వివరాలు రాబట్టవచ్చని కథనాలు వెలువడ్డాయి. అయితే ఇవన్నీ కల్పిత కథనాలని, వీటిని నమ్మవద్దనని యుఐడీఏఐ ఖండించింది.