బిజినెస్

స్పైస్ పార్క్‌కు మరో 20కోట్ల కేంద్ర నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 3: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో రూపుదిద్దుకుంటున్న స్పైస్ పార్క్ పనులు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటుతో మరింత వేగం పుంజుకోనున్నాయి. ఢిల్లీలో బుధవారం నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్‌ప్రభును కలిసి పసుపు రైతులను ఆదుకునేందుకు చేపడుతున్న స్పైస్ పార్క్ పనుల గురించి వివరించారు. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 42 ఎకరాల భూమిని సేకరించి, 30కోట్ల రూపాయలను కేటాయించిందని మంత్రి దృష్టికి తెచ్చారు. స్పైస్ బోర్డు ఆధ్వర్యంలోనే దీని ప్రతిపాదనలు, డీపీఆర్‌ను రూపొందించారని, వాటికి అనుగుణంగానే ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇందుకు కేంద్ర మంత్రి స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులకు తోడు అదనంగా కేంద్రం నుండి మరో 20కోట్ల రూపాయలను సమకూరుస్తామని సంసిద్ధత వ్యక్తం చేశారు. అదేవిధంగా పసుపు పండించే రైతులతో పాటు ఈ పంటను సేకరించే ట్రేడర్లు, పసుపు ఆధారిత రంగంతో సంబంధం ఉన్న వారితో హైదరాబాద్‌లో ఫిబ్రవరి 3వ తేదీన వర్క్‌షాప్ నిర్వహించాలని నిర్ణయించినట్టు ఎంపీ కవిత తెలుపగా, సుగంధ ద్రవ్యాల బోర్డు చైర్మెన్, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ సదస్సులో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. పసుపు రైతులను ఆదుకునేందుకు ఏర్పాటు చేయనున్న స్పెషల్ టర్మరిక్ సెల్ ప్రారంభోత్సవానికి ఫిబ్రవరి మాసంలో హాజరయ్యేందుకు కూడా మంత్రి అంగీకరించారు.
పసుపు రైతులను ఆదుకునేందుకు మంత్రి సురేష్‌ప్రభు స్పైస్ పార్క్‌కు నిధుల కేటాయింపుతో పాటు ఇతరత్రా చర్యలు చేపట్టేందుకు చొరవ చూపడం పట్ల ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు.
అశోక్ గజపతిరాజలో భేటీ
నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటుపై బుధవారం ఎంపీ కవిత చర్చించారు. విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలకు సంబంధించిన బృందాలను పంపాలని ఎంపీ కవిత ఈ సందర్భంగా కోరారు.