బిజినెస్

వీసా మార్పులతో విఘాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 3: హెచ్1బీ వీసాల విషయంలో అమెరికా ఎలాంటి ప్రతికూల చర్యలు చేపట్టినా ఇరుదేశాల సంబంధాలపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నాస్కామ్ తెలిపింది. హెచ్1బీ వీసాల పొడిగింపును నిరోధించేందుకు అమెరికా కొత్త చర్యలను చేపడుతోందంటూ కథనాలు వచ్చిన నేపథ్యంలో నాస్కామ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదిస్తున్న ఈ చర్యలు వల్ల భారత్ ఐటీ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని, దాదాపు 10 లక్షల మందికి పైగా ఈ వీసా హోల్డర్లు స్వదేశానికి తిరుగుముఖం పట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్న సంకేతాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా భారత్- అమెరికా మధ్య ఉన్న మైత్రి బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుందని నాస్కామ్ తెలిపింది. ఇప్పటికే అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారు సైతం ఈ మార్పుల వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుందని అలాగే కేవలం బారత్ ఐటీ పరిశ్రమలకే కాకుండా హెచ్1బీ వీసా కలిగిన ప్రతి భారతీయుడికీ విఘాతక పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అమెరికాలో వృత్తి నిపుణుల సంఖ్య చాలా తక్కువగా ఉన్న తరుణంలో అమెరికా ఈ చర్యలను తలపెట్టడం ఇరుదేశాలకు నష్టమేనని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ అన్నారు. గ్రీన్‌కార్డు ఆమోదం కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య అమెరికాలోగణనీయంగా ఉందని అది వచ్చేవరకూ హెచ్1బీ వీసాల గడువును పొడిగించడానికి ఈ కొత్త నిబంధనలు ఎంత మాత్రం వీలుకల్పించవని అన్నారు. అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని, అమెరికా వస్తువులే కొనాలన్న అధ్యక్షుడు ట్రంప్ ఆలోచనల్లో భాగంగానే హెచ్1బీ వీసాలకు సంబంధించి అమెరిగా అంతర్గత భద్రతాశాఖ ఈ మార్పులను తలపెడుతోంది. గత ఏడాదిగా ట్రంప్ ఈ రకమైన చర్యలనే చేపడుతూ వచ్చారని వాటన్నింటికీ పరాకాష్టగా ఇప్పుడు హెచ్1బీ వీసాల మంజూరు ప్రక్రియపై దృష్టి పెట్టారని అన్నారు. ఈచర్య వల్ల భారతీయులకు సామూహికంగా కలిగే నష్టం చాలా తీవ్రంగానే ఉంటుందని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కాగా నిజంగా ట్రంప్ ఈరకమైన ప్రతికూల చర్యలు చేపడితే ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్వదేశం వచ్చేవారందరికీ స్వాగతం పలుకుతామని మహేంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్రా అన్నారు.