బిజినెస్

6 ‘బలహీన’ బ్యాంకులకు రూ. 7,577 కోట్ల సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షేర్లను విక్రయించి తమ మూలధనాన్ని పెంచుకునేందుకు కొన్ని ‘బలహీన’ బ్యాంకులు ఇప్పటికే ‘బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్’ నుంచి ఆమోదం పొందాయి. 1,375 కోట్ల రూపాయల మేరకు మూలధనాన్ని సమకూర్చుకునేందుకు షేర్లను జారీ చేయాలని యూకో బ్యాంకు బుధవారం నిర్ణయించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కూడా 323 కోట్ల రూపాయలను షేర్ల విక్రయం ద్వారా సమకూర్చుకునేందుకు కసరత్తు చేసింది.
న్యూఢిల్లీ, జనవరి 3: నష్టాలతో బలహీనపడిన ప్రభుత్వరంగ బ్యాంకులకు మూలధనాన్ని తిరిగి సమకూర్చే పథకంలో భాగంగా ఆరు జాతీయ బ్యాంకులకు 7,577 కోట్ల రూపాయలను అందజేసేందుకు ఆర్థికమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రిజర్వుబ్యాంకు విధానాలకు లోబడి నష్టదాయక బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చేందుకు కేంద్రం ‘ఇంద్రధనుస్’ పథకాన్ని ప్రారంభించింది. 2019 మార్చిలోగా ‘బలహీన’ బ్యాంకులకు 70వేల కోట్ల రూపాయలను మూలధనంగా అందజేస్తారు. మూడేళ్ల క్రితం ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్టల్రకు సాయం అందించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదముద్ర వేసింది. వాటాదారుల, డైరెక్టర్ల ఆమోదం వంటి లాంఛనాలన్నీ పూర్తయ్యాక మరికొద్ది వారాల్లో ఈ బ్యాంకులకు మూలధనం సమకూరుతుంది.
షేర్లను విక్రయించి తమ మూలధనాన్ని పెంచుకునేందుకు కొన్ని ‘బలహీన’ బ్యాంకులు ఇప్పటికే ‘బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్’ నుంచి ఆమోదం పొందాయి. 1,375 కోట్ల రూపాయల మేరకు మూలధనాన్ని సమకూర్చుకునేందుకు షేర్లను జారీ చేయాలని యూకో బ్యాంకు బుధవారం నిర్ణయించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 323 కోట్ల రూపాయలను షేర్ల విక్రయం ద్వారా సమకూర్చుకునేందుకు కసరత్తు చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2,257 కోట్లు, ఐడిబిఐ బ్యాంకుకు 2,729 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్టక్రు 650 కోట్లు, దేనా బ్యాంకుకు 243 కోట్లు సమకూర్చాలని కేంద్రం నిర్ణయించింది. మూలధనాన్ని తిరిగి సమకూర్చుకున్నాక ఈ బ్యాంకులు ఆర్థికంగా తేరుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
నిరర్థక ఆస్తులు, రుణ బకాయిల కారణంగా కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు క్రమంగా బలహీనపడుతున్నాయని, రెండేళ్ల కాలంలో వీటికి 2.11 లక్షల కోట్ల రూపాయలను మూలధనంగా సమకూర్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందని గత అక్టోబర్‌లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల విలువ 2015 మార్చిలో 2.75 లక్షల కోట్లు కాగా, గత ఏడాది మార్చి నాటికి ఆ విలువ 7.33 లక్షల కోట్లకు చేరింది. మూలధన సేకరణకు బాండ్లను జారీ చేయడం ద్వారా 1.35 లక్షల కోట్లు, మార్కెట్ ద్వారా 58వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోవాలని భావించారు. మూలధన సేకరణకు బాండ్లను జారీ చేసేందుకు విధివిధానాలను రూపొందించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది.
‘ఇంద్రధనుస్’ పథకం కింద రెండేళ్లలో బ్యాంకులకు 18వేల కోట్లను సమకూరుస్తామని కూడా గతంలో జైట్లీ తెలిపారు. కాగా, గత మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులకు 51,858 కోట్ల రూపాయలను సమకూర్చగా, మిగతా 18,142 కోట్లను రాబోయే రెండేళ్ల కాలంలో అందజేస్తారు.