బిజినెస్

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 3: బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. నిఫ్టీ స్వల్ప లాభంతో ముగియగా, సెనె్సక్స్ స్వల్ప నష్టంతో ముగిసింది. సెనె్సక్స్ 18.88 పాయింట్లు నష్టపోయి 33,998.37 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ కేవలం ఒక్క పాయింట్ స్వల్ప లాభంతో 10,443.20 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.63.54 వద్ద కొనసాగింది. ఆటో, ఐటీ, గ్యాస్, చమురు, ఆరోగ్యసేవల రంగాలు నష్టపోయాయి.
ఎన్‌ఎస్‌ఇలో అదానీ పోర్ట్సు, ఎల్ అండ్ టీ, ఐసిఐసిఐ, ఎస్ బ్యాంక్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, టాటా స్టీల్ వంటి కంపెనీల షేర్లు లాభాలను చవిచూశాయి. డాక్టర్ రెడ్టీస్ ల్యాబ్స్, విప్రో, ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో, మారుతి సుజికీ, టాటా మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంకు, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంకు వంటివి 2.73 శాతం మేరకు నష్టపోయాయి. రిలయన్స్ రిఫైనరీలు, హీరో మోటార్ గ్రూప్, టైటాన్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు షేర్లు లాభాల దిశగా కొనసాగాయి.
ఎరువులకు ప్రస్తుతం డిమాండ్ ఉన్న దృష్ట్యా నాగార్జున కెమికల్స్ 19.91 శాతం, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 5.72 శాతం, గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ 2.49 శాతం, నేషనల్ ఫెర్టిలైజర్స్ 4.05 శాతం, జురారీ ఆగ్రో కెమికల్స్ 2.46 శాతం, మేంగళూరు కెమికల్స్ 3.59 శాతం, చంబల్ ఫెర్టిలైజర్స్ 2.07 శాతం మేరకు లాభపడ్డాయి. బుధవారం నాడు ముఖ్యంగా ఆటో ఇండెక్స్ 0.55 శాతానికి పడిపోయింది.
ఐటీ, గ్యాస్, చమురు, టెక్నాలజీ, ఆరోగ్యసేవల రంగాలు ప్రధానంగా నష్టాలను చవిచూశాయి.