బిజినెస్

రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చేతులు కలపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హౌరా, జూన్ 9: రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తమతో చేతులు కలపాలని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు విజ్ఞప్తి చేశారు. ‘దేశంలో రైల్వేలను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఇందులో భాగంగా స్టేషన్లను అభివృద్ధి చేసి మరింత ఆధునీకరించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు రైల్వేలతో చేతులు కలపాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని గురువారం హౌరా రైల్వే స్టేషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సురేష్ ప్రభు అన్నారు. మెట్రో రైల్వేతో పాటు తూర్పు, ఈశాన్య రైల్వేలకు సంబంధించిన పలు ప్రాజెక్టులను ఆయన ఈసందర్భంగా ప్రారంభించారు. దేశ రైల్వే వ్యవస్థలో పశ్చిమ బెంగాల్ ‘వ్యూహాత్మక స్థానాన్ని’ ఆక్రమించిందని, ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేందుకు తమ శాఖ చేయూతనిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌లను పూర్తిగా తొలగించి దేశంలోనే తొలిసారి ఈ ఘనత సాధించిన తూర్పు రైల్వే జోన్‌ను సురేష్ ప్రభు ఈసందర్భంగా అభినందించారు.