బిజినెస్

బెంగళూరులో గ్లోబల్ డిజైన్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: ఇంజనీరింగ్, డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెట్ సొల్యూషన్స్‌లో అగ్రగామిగా ఉన్న సియాంట్ సంస్ధ బెంగళూరులో గ్లోబల్ డిజైన్ సెంటర్‌ను ప్రారంభించింది. వౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత స్ధాయి సలహాలు ఇచ్చేందుకు అవసరమైన టెక్నాలజీ తమ వద్ద ఉన్నట్లు ఆ సంస్ధ ఎండి బి కృష్ణ తెలిపారు. సివిల్, స్ట్రక్చరల్, భవన సమాచారం మోడలింగ్‌ల సమాచారంపై ఆధునిక సొల్యూషన్స్ సేకరించామన్నారు. ఇందులో వంద మంది ఇంజనీర్లును నియమించనున్నట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి పూర్తి స్ధాయిలో ఈ సెంటర్ పనిచేస్తుందన్నారు. పరిశ్రమలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు అవసరమైన టెక్నాలజీని రూపొందించామని ఎస్‌ఎంఇసి సిఇవో ఆండే గాడ్విన్ తెలిపారు.