బిజినెస్

త్వరలో ఆఫ్రికా దేశాలకు మహీంద్రా ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: దేశంలో వినిమయ వాహనాల (యుటిలిటీ వెహికల్స్)ను తయారు చేస్తున్న అతిపెద్ద సంస్థల్లో ఒకటైన ‘మహీంద్రా’ రానున్న 18 నెలల కాలంలో ఆఫ్రికాకు తమ భారీ, వాణిజ్య (హెవీ, కమర్షియల్) వాహనాలను ఎగుమతి చేయాలని యోచిస్తోంది. మహీంద్రా సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘తేలికపాటి వాణిజ్య వాహనాలు (ఎల్‌సివిలు) సహా ప్రస్తుతం మేము అమ్ముతున్న వాహనాల్లో దాదాపు 10 శాతం వాహనాలను ఎగుమతి చేయాలనుకుంటున్నాం. రానున్న 18 నెలల్లో ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు వీటిని ఎగుమతి చేస్తాం. తాజాగా మేము మార్కెట్లో ప్రవేశపెట్టిన హెవీ మోడల్ ట్రక్ ‘బ్లాజో’తో పాటు ఇతర ఎల్‌సివిలతో ఈ ఎగుమతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది’ అని మహీంద్రా ట్రక్కులు, బస్సుల విభాగం సిఇఓ నళిన్ మెహతా హైదరాబాద్‌లో వెల్లడించారు. అయితే మహీంద్రా సంస్థ ప్రణాళికలకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ప్రస్తుతం మార్కెట్లో తమ హెవీ ట్రక్కులు 3.5 శాతం వాటాను కలిగి ఉన్నాయని, రానున్న రెండేళ్లలో దీనిని రెట్టింపు చేయాలని యోచిస్తున్నామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ట్రాక్టర్ ట్రైలర్లు, టిప్పర్లతో పాటు ‘బ్లాజో’ బ్రాండ్ నేమ్‌తో కొత్తగా రూపొందించిన హెవీ కమర్షిల్ ట్రక్‌ను మహీంద్రా సంస్థ బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఈ సంస్థ ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలోనే ‘బ్లాజో’ను ఆవిష్కరించినప్పటికీ వాణిజ్యపరంగా బుధవారమే దీనిని మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ట్రక్కులు, బస్సుల విభాగంలో తమ వ్యాపారం స్థిరంగా పురోభివృద్ధి చెందుతోందని, హెవీ కమర్షిల్ వెహికల్ సెగ్మెంట్‌లో తాము ఎంతో ముందున్నామని నళిన్ మెహతా పేర్కొంటూ, తాజాగా ప్రవేశపెట్టిన ‘బ్లాజో’ హెవీ ట్రక్కులతో మార్కెట్లో తమ వాటా మరింత పెరుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.