బిజినెస్

చర్మ సమస్యలకు ఆయుర్వేదంతో చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: చర్మ, శిరోజాల సమస్యల నివారణకు ఆయుర్వేద శాస్తప్రరమైన ఔషధులను తయారుచేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు బయోటీక్ సంస్ధ ఒక ప్రకటనలో వెల్లడించింది. డిస్నీ ఇండియా సంస్ధ భాగస్వామ్యంతో ఈ మందులను తయారు చేసి విక్రయిస్తున్నట్లు ఆ సంస్ధ ఎండి వినిత్ జైన్ తెలిపారు. తమ సంస్ధలో అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు వివిధ వ్యాధులపై పరిశోధనలు చేపట్టారన్నారు. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన చర్మవ్యాధి నిపుణుల పరిశోధనలు, సలహాలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బేబీ కిడ్స్‌కు సంబంధించి సమస్యల నివారణకు మందులు తయారుచేసినట్లు చెప్పారు. భారతదేశంలో పసిపిల్లలకు సంబంధించి ఆయుర్వేద మందుల తయారీ ఇంకా శైశవ దశలో ఉందని, దీనికి సంబంధించి తమ సంస్ధ విస్తృతమైన పరిశోధనలు చేపట్టిందన్నారు.