బిజినెస్

ఈ-కామర్స్‌లో ఏపీ మరో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 13: ఇ-కామర్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత అలీబాబా డాట్ కామ్ కంపెనీ సహకారంతో ఏపీలో దాదాపు 20వేల మంది నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి కల్పించేందుకు త్వరలో ఒక ఒప్పందం చేసుకోబోతోంది. అలీబాబా కంపెనీ ప్రతినిధులతో ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్, ఏపీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ శనివారం ఉదయం హైదరాబాద్‌లో చర్చలు జరిపారు. మరో వారం పది రోజుల్లో విజయవాడలో అలీబాబా కంపెనీ ప్రతినిధులతో ఎంఓయు చేయనున్నామని మంత్రి అఖిలప్రియ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖలో ఉపాధి శిక్షణ కోసం మంత్రి తొలుత అలీబాబా కంపెనీ చైనా ప్రతినిధులతో చర్చలు జరిపారు. అయితే ఇది కేవలం తమ శాఖకే పరిమితం కాకుండా ఏపీలోని నిరుద్యోగ యువత అందరికీ వర్తింప చేయాలని చైనా ప్రతినిధులను పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేష్ వద్దకు తీసుకెళ్లారు. అలీబాబా కంపెనీ ఇండియా బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ వండర్ ఛాన్, టీడీఐ గ్లోబల్ హెడ్ సంజయ్ శర్మలతో చర్చించిన లోకేష్, ఏపీలో నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు ఇది సదవకాశమని పేర్కొన్నారు. ఈ కంపెనీ ద్వారా ఏపీలో వేలాది మంది నిరుద్యోగులకు టెక్నికల్, ఇ-కామర్స్, మార్కెటింగ్‌లో శిక్షణ అందించి, ఉపాధి కల్పిస్తామని అలీబాబా కంపెనీ ఇండియా బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ వండర్ ఛాన్ తెలిపారు.