బిజినెస్

మూడోరోజూ రికార్డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 19: మూడో త్రైమాసికంలో బ్లూచిప్‌లు సాధించిన మంచి లాభాలు, 23 వస్తువులు, 54 సేవలపై పన్ను రేట్లను తగ్గించడం సహా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి తీసుకున్న హేతుబద్ధీకరణ నిర్ణయాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు దన్నుగా నిలిచాయి.
దీంతో కొనుగోళ్లలో తాజా కదలికతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ కీలక సూచీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. వరుసగా మూడో రోజు చోటుచేసుకున్న బుల్ రన్‌తో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 251.29 పాయింట్లు పెరిగి, సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 35,511.58 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 77.70 పాయింట్లు పుంజుకొని, సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 10,894.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రా-డేలో తొలిసారి 10,900 పాయింట్ల మార్కును అధిగమించింది. 29 వస్తువులు, 54 సేవలపై పన్ను రేట్లను తగ్గిస్తూ జీఎస్‌టీ మండలి గురువారం తీసుకున్న నిర్ణయం మదుపరులలో సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. దీనికితోడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ వంటి బ్లూచిప్‌లు మూడో త్రైమాసికంలో సాధించిన ప్రోత్సాహకర లాభాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి. 30 షేర్లతో కూడిన సెనె్సక్స్ శుక్రవారం ఉదయం అధిక స్థాయిల వద్ద ప్రారంభమయి, ఆల్ టైమ్ హై 35,542.17 పాయింట్లకు ఎగబాకింది. అయితే చివరలో స్వల్పంగా తగ్గి క్రితం ముగింపుతో పోలిస్తే 251.29 పాయింట్ల (0.71 శాతం) పెరుగుదలతో 35,511.58 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ గురువారం 35,260.29 పాయింట్ల వద్ద ముగిసిన విషయం విదితమే. సెనె్సక్స్ మూడు వరుస సెషన్లలో కలిపి మొత్తం 740.53 పాయింట్లు పెరిగింది.
50 షేర్లతో కూడిన నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే శుక్రవారం 77.70 పాయింట్లు (0.72 శాతం) పుంజుకొని, 10,894.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీ గురువారం నాటి జీవనకాల గరిష్ఠ స్థాయి ముగింపు అయిన 10,817 పాయింట్ల రికార్డును శుక్రవారం అధిగమించింది. ఇంట్రా-డేలో ఈ సూచీ ఆల్‌టైమ్ హై 10,906.85 పాయింట్ల స్థాయిని తాకింది. దేశీయ మార్కెట్లు పుంజుకోవడం ఇది వరుసగా ఏడో వారం. ఈ వారంలో సెనె్సక్స్ గణనీయంగా 919.19 పాయింట్లు (2.65 శాతం) పెరగగా, నిఫ్టీ 213.45 (1.99 శాతం) పుంజుకుంది. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల ధోరణి, ముడి చమురు ధరలు తగ్గడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లకు ఊతమిచ్చాయి. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) స్టాక్ మార్కెట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రస్తుతం కొనసాగుతున్న రికార్థు స్థాయి బుల్ రన్‌కు దోహదపడుతున్నారు. గురువారం ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 1,894.99 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 657.46 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
రంగాల వారీగా చూస్తే, బ్యాంకెక్స్ అత్యధికంగా 1.52 శాతం లాభపడింది. రియల్టీ 1.26 శాతం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 1.19 శాతం, ప్రభుత్వ రంగ సంస్థలు 1.06 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.92 శాతం, మెటల్ 0.91 శాతం, చమురు-సహజ వాయువు 0.87 శాతం, పవర్ 0.46 శాతం, హెల్త్‌కేర్ 0.43 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.42 శాతం, ఐటీ 0.36 శాతం, ఆటో 0.15 శాతం చొప్పున పుంజుకున్నాయి.
సెనె్సక్స్ ప్యాక్‌లోని కంపెనీలలో అదాని పోర్ట్స్ అత్యధికంగా 4.68 శాతం పెరిగింది. మూడో త్రైమాసికంలో మంచి లాభాలను ఆర్జించిన ఈ కంపెనీ షేర్లు మదుపరులను ఆకర్షించాయి. యెస్ బ్యాంక్ 2.37 శాతం పెరుగుదలతో రెండో స్థానంలో నిలిచింది. మూడో త్రైమాసికంలో తన నికర లాభాన్ని 22 శాతం పెంచుకోవడం ఈ ప్రైవేటు బ్యాంకు షేర్లకు డిమాండ్ పెరిగింది.