బిజినెస్

చార్జీలను కట్టడి చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: ప్రైవేటు విమానయాన సంస్థలు చార్జీలను ఏకపక్షంగా పెంచేస్తున్నాయంటూ ప్రయాణికులనుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో విమాన చార్జీలను కట్టడి చేసే యోచచన లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసినట్లయితే ప్రైవేటు విమాన సంస్థల మధ్య పోటీ ఉండదని కూడా వాదిస్తోంది. విమాన చార్జీలపై పరిమితి విధించడం మంచి వ్యాపార ఆలోచన కాదని, ఎందుకంటే దీనివల్ల చిన్న పట్టణాలకు కూడా విమాన సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ ఆలోచన దెబ్బతింటుందని, ఎందుకంటే లాభదాయకం కాని రూట్లలో విమానాలు నడపడానికి విమానయాన సంస్థలు ముందు రావని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు అభిప్రాయ పడ్డారు. అయితే నిర్ణీత కాలవ్యవధిలో ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థ ఏర్పాటు సహా ప్రయాణికులకు సంబంధించిన పలు చర్యలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన చెప్పారు. అంతేకాదు, దేశీయ ప్రయాణికుల డిమాండ్ శరవేగంగా పెరుగుతున్న మార్కెట్లలో భారత దేశ పౌర విమానయాన రంగం ఒకటని ఆయన చెప్పారు. ఈ చర్యల్లో భాగంగా టికెట్ క్యాన్సిలేషన్ చార్జీలను హేతుబద్దం చేయడానికి పలు చర్యలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించవచ్చని తెలుస్తోంది.
దేశంలో ఇనే్నళ్ల కాలంలో 3 వేల కోట్ల రూపాయలు పైగా వ్యయంతోఎయిర్‌పోర్ట్ అథారిటీ నిర్మించిన 32 విమానాశ్రయాలు ఇప్పటికీ విమానాల రాకపోకలు లేక ఖాళీగా పడి ఉన్నాయని, మార్కెట్‌కు అనుగుణంగా పెరగడం, తగ్గడం జరిగే చార్జీలపై ఆంక్షలు విధించినట్లయితే ఈ విమానాశ్రయాలనుంచి విమాన సర్వీసులను ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆలోచన నీరుగారి పోతుందని పిటిఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో మంత్రి చెప్పారు. విమాన చార్జీలపై పరిమితి విధించడం అనేది చాలా సంక్లిష్టమైన సమస్య అని, దానికి సులభమైన పరిష్కారాలు లేవని మంత్రి అంటూ, చాలా వరకు పోటీయే ఈ సమస్యకు పరిష్కారం చెబుతుందని ఆయన అన్నారు.
ఎయిర్ ఇండియా
పరిస్థితి దారుణం
కాగా, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, దాన్ని అమ్మేద్దామన్నా కొనడానికి ఎవరూ ముందుకు రారనిపిస్తోందని అశోక్ గజపతి రాజు అంటూ, అలాగని, నిరంతరంగా దాన్ని ప్రభుత్వం పెంచి పోషించే పరిస్థితి కూడా లేదని స్పష్టం చేశారు. 2007లో అప్పటి ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థలను విలీనం చేసినప్పటినుంచి నష్టాల బాటలోనే సాగుతున్న ఎయిర్ ఇండియా నష్టాలు ఇప్పుడు 50 వేల కోట్ల రూపాయలను దాటిపోయాయి. గత యుపిఏ ప్రభుత్వం ప్రకటించిన 30 వేల కోట్ల రూపాయల బెయిలవుట్ ప్యాకేజిపైనే అది ఇప్పుడు మనుగుడ సాగిస్తోంది. అయితే ఎయిర్ ఇండియా మరింత సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని, సంస్థలోని సిబ్బంది అంతా ఒక టీమ్‌లాగా పని చేయని పక్షంలో అది మళ్లీ లాభాల బాట పట్టడం అసాధ్యమవుతుందని రాజు అంటూ, ఈ విషయాన్ని వాళ్లు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదన్నారు. అయితే ఎయిర్ ఇండియాకు మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకునే శక్తి సామర్థ్యాలున్నాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తూ, ఈ దిశగా ఆ సంస్థ కృషి చేస్తూ ఉందని కూడా చెప్పారు. అంతేకాదు మిగతా అందరిలాగా ఎయిర్ ఇండియాను తప్పు పట్టడం తనకు ఇష్టం లేదన్నారు.

చిత్రం పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు