బిజినెస్

ఆ నిబంధన తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 21: ఎగుమతులు పుంజుకోవడానికి, ఉద్యోగాల కల్పనను పెంచడానికి ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజెడ్‌లు) ప్రస్తుతం అనుభవిస్తున్న ఆదాయపు పన్ను ప్రోత్సాహకాలను కొనసాగించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గట్టిగా భావిస్తోంది. ఎస్‌ఈజెడ్‌లపై ప్రస్తుతం విధిస్తున్న కనీస ప్రత్యామ్నాయ పన్నును కూడా ఎత్తివేయాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసింది. 2020 మార్చి 31కి ముందు కార్యకలాపాలు ప్రారంభించిన ఎస్‌ఈజెడ్‌లకు మాత్రమే ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలు వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ నిబంధన ఎస్‌ఈజెడ్‌ల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అందువల్ల ఈ నిబంధనను తొలగించాలని వాణి జ్య మంత్రిత్వ శాఖ తన లేఖలో ఆర్థి క మంత్రిత్వ శాఖను కోరిందని ఆ అధికారి వెల్లడించారు. నిర్దిష్టమైన తేదీకి ముందు కార్యకలాపాలు ప్రా రంభించకుంటే పన్ను ప్రోత్సాహకాలు వర్తించబోవనే ఈ నిబంధన తిరోగామి చర్య అని, ఎస్‌ఈజెడ్‌లలో పెట్టుబడులపై, ఉద్యోగాల కల్పనపై ఈ నిబంధన ప్రతికూలంగా పనిచేస్తుందని పారిశ్రామిక నిపుణులు పేర్కొంటున్నారు. ‘ఈ నిబంధన పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రాజెక్టులు 2020 మార్చి నాటికి పూర్తి అయి ఉండకపోవచ్చంటే, నిజంగా ఆ లోపు పూర్తి చేయడం ఆచరణ సాధ్యం కాకపోయి ఉండొచ్చు. అందువల్ల ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించే అంశాన్ని పరిశీలించాలి’ అని ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ ఈఓయూస్ అండ్ ఎస్‌ఈజెడ్స్ (ఈపీసీఈఎస్) మాజీ చైర్మన్ రాహుల్ గుప్తా అన్నారు.