బిజినెస్

త్వరలో యువ సాధికార నిరుద్యోగ భృతి*

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జనవరి 22: ఏపీలో త్వరలో నిరుద్యోగులకు భృతి కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను జిల్లాల అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. సంబంధిత అధికారులు జిల్లాల్లో యువత, విద్యావంతుల నుండి సలహా సూచనలను స్వీకరిస్తోంది. విద్యావంతుల అభిప్రాయాలు, సలహాలు, సూచనల మేరకు అవసరమైన మార్పులుచేసి భృతి కల్పనకు చట్టరూపం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టోలో నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ప్రకటించింది. నిరుద్యోగులకు నెలకు కనీసం రూ.2000 భృతి కల్పిస్తామని చెప్పింది. 2019 ఎన్నికల నాటికి నిరుద్యోగ భృతి అంశాన్ని పరిష్కరించడానికి గాను యువ సాధికార నిరుద్యోగ భృతి పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆయా జిల్లాల అధికారులకు డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. వీటిని విశ్వ విద్యాలయాలు, కళాశాలల్లోని విద్యార్థులకు అందజేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ పథకం కింద లబ్ధిపొందగోరు అభ్యర్ధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండి, సమీప ఉపాధి కల్పన కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భృతి పొందేందుకు ఇంటర్మీడియట్, ఐటిఐ ఉత్తీర్ణత కనీస విద్యార్హతగా ప్రకటించారు.