బిజినెస్

అమ్మకాల ఒత్తిడిలో మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 9: పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు(ఐఐపి) వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు ఇటీవల అంచనాలకు మించి లాభాలు ఆర్జించిన కంపెనీల స్టాక్స్‌లో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు దిగడంతో గత రెండు రోజులుగా లాభాల బాటలో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి నష్టాల్లో ముగిశాయి. వచ్చే వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం జరగనున్న నేపథ్యంలో మదుపరులు తమ వద్ద ఉన్న స్టాక్స్‌ను వదిలించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని బ్రోకర్లు అంటున్నారు. అంతేకాకుండా జపాన్ ఆర్థిక స్థితికి సంబంధించిన ఆందోళనలు మరింత తీవ్రమైన నేపథ్యంలో టోక్యో స్టాక్ మార్కెట్లు పతనం కావడం, అలాగే ఐరోపా మార్కెట్లు నష్టాలతో మొదలుకావడం కూడా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపించాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ 243.21 పాయింట్లు నష్టపోయి 26,763.46 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఒక దశలో 8,184.60 పాయింట్ల కనిష్టస్థాయిని తాకిన నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ చివర్లో కొన్ని స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో కొంతమేరకు పుంజుకొని చివరికి 69.45 పాయింట్ల నష్టంతో 8,203.60 వద్ద ముగిసింది.
ఐటి, టెక్నాలజీ, ఎఫ్‌ఎంసిజి, వౌలిక వస్తువులు, ఆటో, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ రంగాలకు చెందిన స్టాక్స్ నష్టపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం నష్టపోయాయి. సెనె్సక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 18 షేర్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్ అత్యధికంగా 4.27 శాతం నష్టపోగా, హీరో మోటోకార్ప్, ఐటిసి. హెచ్‌యుఎల్, డాక్టర్ రెడ్డీస్, ఏసియన్ పెయింట్స,హెచ్‌డిఎఫ్‌సి, బజాజ్ ఆటో, టిసిఎస్, ఎల్‌అండ్‌టి, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. అయితే కోల్‌ఇండియా అత్యధికంగా 2.13 శాతం లాభపడగా, ఒఎన్‌జిసి, రిల్, ఎన్‌టిపిసి, సిప్లా, యాక్సిస్ బ్యాంక్‌లాంటి కొన్ని కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో జపాన్‌కు చెందిన నిక్కీ దాదాపు ఒక శాతం మేర నష్టపోగా, హాంకాంగ్, చైనా మార్కెట్లు సెలవు కారణంగా మూతపడ్డాయి. ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభంలోనే నష్టాలు చవి చూశాయి.