బిజినెస్

వీడుతున్న విశ్వసనీయత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 22: భారత్ పట్ల విశ్వసనీయత సన్నగిల్లుతోందా? అన్న ప్రశ్నకు సర్వేలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ప్రజల విశ్వసనీయత చూరగొన్న దేశాల జాబితాలో ప్రత్యేకస్థానంలో ఉండే భారత్, గత ఏడాదితో పోలిస్తే మాత్రం కిందకు దిగజారిందని తాజా సర్వే స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం, వ్యాపారం, ఎన్జీవో, మీడియా రంగాలకు సంబంధించి భారత్‌లో ప్రజా విశ్వసనీయత గత ఏడాదికంటే దారుణంగా తగ్గిందని ఈడెల్‌మన్ ట్రస్ట్ బారోమీటర్ సర్వే వెల్లడించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు ప్రారంభమవుతున్న తరుణంలో ఈ నివేదిక వెల్లడవ్వడం ఇబ్బందికర విషయమే. విశ్వసనీయతకు సంబంధించి 28 దేశాల్లో నిర్వహించిన సర్వేలో 20 దేశాలు కనీస అర్హతలేని ప్రాంతాల జాబితాలో ఉండిపోయాయి. ఒక్క చైనా మాత్రమే విశ్వసనీయతా ప్రమాణం గత ఏడాదికంటే పెంచుకోగలిగిందని సర్వే స్పష్టం చేసింది. ప్రజా విశ్వసనీయతను చూరగొన్న దేశాల జాబితాలో చైనా టాప్ ప్లేస్‌లో ఉందని పేర్కొంది. విషయ పరిజ్ఞానం కలిగిన ప్రజలు, సాధారణ ప్రజలను ప్రమాణంగా తీసుకుని నిర్వహించిన సర్వేలో చైనాకు నూటికి 83, 74 మార్కులు లభించాయి. ఈ రెండు క్యాటగిరీల్లోనూ భారత్‌కు 77, 68 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిస్తే, ఇండోనేసియా ద్వితీయ స్థానం సంపాదించుకుంది. 28 దేశాల్లో 33వేల మందినుంచి గత అక్టోబర్ 28నుంచి నవంబర్ 20 మధ్య విశ్వసనీయతపై అభిప్రాయాలు సేకరించినట్టు సర్వే పేర్కొంది. ‘విశ్వసనీయతపై చైనా సాధించిన స్కోరు భారత్ సహా యుఏఇ, ఇండోనేసియా, సింగపూర్ దేశాలకు దగ్గరగానే ఉంది. ఇదిలావుంటే, కొన్ని పశ్చిమ దేశాలైతే అసలు విశ్వసనీయత పరిగణన జాబితాలోకే రాలేదు’ అని సర్వే పేర్కొంది. విశ్వసనీయతలో గత ఏడాది యుఎస్ టాప్‌లోవుంటే, అప్పటి పరిస్థితితో పోల్చిచూస్తే విశ్వసనీయత తగ్గిన ఆరు దేశాల జాబితాలో భారత్ ఉన్నట్టు సర్వే పేర్కొంది. ‘గత ఏడాదితో పోలిస్తే యుఎస్‌పట్ల విశ్వసనీయత తగ్గడానికి కారణం ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లడమే’ అని సర్వే స్పష్టం చేస్తోంది. వ్యాపారం, మీడియా, ఎన్జీవో విభాగాల పట్లా యుఎస్‌లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నమ్మకం సన్నగిల్లినట్టు సర్వే పేర్కొంది. విశ్వసనీయత తగ్గిన ఆరు దేశాల జాబితాను పరిశీలిస్తే అమెరికా (37 పాయింట్లు), ఇటలీ (21), బ్రెజిల్ (-17), దక్షిణ అమెరికా (-17), భారత్ (-13), కొలంబియా (-13)లు విశ్వసనీయత పాయింట్లను నష్టపోయాయి. ప్రపంచం మొత్తంమీద మీడియాకే అత్యంత కనిష్ట విశ్వసనీయత పాయింట్లు లభించినట్టు సర్వే ప్రత్యేకంగా పేర్కొంది. ‘సెర్చ్ ఇంజన్లు, సోషల్ మీడియా కారణంగానే మీడియా పట్ల నమ్మకం సడలిపోడానికి కారణం’ అని సర్వేలో స్పష్టం చేయడం గమనార్హం.